GT vs CSK Highlights: రెండు జట్లు తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లు. ఈ సమయంలో గుజరాత్ టైటాన్స్ పైచేయి సాధించగా.. చెన్నై సూపర్ కింగ్స్ తడబడింది. శుభ్‌మన్ గిల్, సాయి సుదర్శన్ సంచలన సెంచరీలతో గుజరాత్ భారీ స్కోర్ సాధించగా.. అది ఛేదించలేక చెన్నై తడబడింది. అహ్మదాబాద్ వేదికగా శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో గుజరాత్ 35 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ ఓటమితో చెన్నై ప్లే ఆఫ్స్ అవకాశాలను మరింత క్లిష్టం చేసుకుంది.
Also Read: IPL SRH vs LSG: ఉప్పల్‌లో హైదరాబాద్ అదుర్స్.. 10 ఓవర్లలోనే 10 వికెట్ల తేడాతో తిరుగులేని విజయం
టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన గుజరాత్ టైటాన్స్ ప్రారంభం నుంచి ఆఖరి బంతి వరకు చితక్కొట్టింది. శుభ్‌మన్ గిల్, సాయి సుదర్శన్ బ్యాటింగ్ బీభత్సంతో 3 వికెట్ల నష్టానికి 231 పరుగులు చేసింది. 51 బంతుల్లో సాయి సుదర్శన్ 103 పరుగులు బాదగా.. కెప్టెన్ శుభ్‌మన్ గిల్ అదే స్థాయి ప్రదర్శన కనబర్చాడు. 55 బంతుల్లో 104 పరుగులు సాధించిన గిల్ 6 సిక్స్‌లు, 9 బంతులు ఉన్నాయి. ప్రత్యర్థి జట్టును కట్టడి చేయడంలో చెన్నై బౌలర్లు విపలమయ్యారు. అతి కష్టంగా తుషార్ దేశ్‌పాండే రెండు వికెట్లు పడగొట్టారు. సమర్‌జిత్ సింగ్, డేరిల్ మిచెల్ నుంచి వసతులు రాబడుతున్నారు.
భారీ లక్ష్య ఛేదనకు దిగిన చెన్నై సూపర్ కింగ్స్ 20 ఓవర్లకు 8 వికెట్లు కోల్పోయి 196 పరుగులు చేసి ఓటమి వైపు నిలబడింది. ఓపెనర్లు అజింక్యా రహనే, రచిన్ రవీంద్రలు సత్తా చాటకపోవడంతో శుభారంభం దక్కలేదు. అనంతరం డేరిల్ మిచెల్ (63), మొయిన్ అలీ (56) పరుగులు భారీ స్కోరర్లుగా నిలిచారు. ఆఖరిలో శివమ్ దూబే (21), మహేంద్ర సింగ్ ధోనీ (26), రవీంద్ర జడేజా (18) కూడా దూకుడు కనబర్చలేకపోయారు. బౌలింగ్‌పరంగా చూస్తే గుజరాత్ దూకుడుగా బౌలింగ్ ప్రదర్శన చేసింది. మోహిత్ శర్మ 3 వికెట్లు పడగొట్టి చెన్నైకి కళ్లెం వేశాడు. రషీద్ ఖాన్ 2, ఉమేశ్ యాదవ్, సందీప్ వారియర్ ఒక్కో వికెట్ చొప్పున తీశారు. ఈ విజయంతో గుజరాత్‌కు తదుపరి అడుగు వేసేందుకు అవసరం లభించింది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter