Tim David sold to Mumbai Indians for INR 8.25 crores: అతడు ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)2021లో ఆడింది ఒకేఒక్క మ్యాచ్.. అందులోనూ కేవలం ఒకే ఒక్క పరుగు చేసి ఔట్ అయ్యాడు. అలాంటి ఆటగాడికి ఐపీఎల్ 2022 మెగా వేలంలో కాసుల వర్షం కురిసింది. ఆ ప్లేయర్ మరెవరో కాదు.. ఆస్ట్రేలియా బ్యాటర్ టిమ్ డేవిడ్. బెంగళూరు వేదికగా జరుగుతున్న ఐపీఎల్ 2022 వేలంలో డేవిడ్‌ను ముంబై ఇండియన్స్ రూ. 8.25 కోట్ల భారీ ధరకు కొనుగోలు చేసింది. ఇది చాలా మందికి ఆశ్చర్యానికి గురిచేసింది.
ఆస్ట్రేలియా బ్యాటర్ టిమ్ డేవిడ్ 40 లక్షల రూపాయల బేస్ ప్రైజ్‌తో ఐపీఎల్ 2022 మెగా వేలంలోకి వచ్చాడు. ఢిల్లీ క్యాపిటల్స్ అతని కోసం మొదట బిడ్ వేసింది. ఆ తర్వాత కోల్‌కతా నైట్ రైడర్స్ కూడా వేలం వేసింది. దాంతో డేవిడ్ ధర పెరిగింది. ఈ సమయంలో లక్నో సూపర్‌జెయింట్స్ కూడా అతనిపై ఆసక్తి చూపింది. క రాజస్థాన్ రాయల్స్ కూడా డేవిడ్ కోసం వేలం వేసింది. దాంతో ఆస్ట్రేలియా ఆటగాడి వేలం 5 కోట్లు దాటింది. అన్ని జట్లకు గట్టి పోటీ ఇచ్చిన ముంబై ఇండియన్స్ భారీ ధరకు ఎగరేసుకోపోయింది.
టిమ్ డేవిడ్‌ను ఐపీఎల్ 2021లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తన జట్టులో చేర్చుకుంది. యూఏఈలో జరిగిన రెండవ లెగ్ సమయంలో ఫిన్ అలెన్ దూరమవడంతో.. డేవిడ్ ఆ స్థానంలోకి వచ్చాడు. అయితే జట్టులో చాలామంది స్టార్లు ఉండడంతో అతడికి కేవలం ఒక మ్యాచ్‌లో మాత్రమే ఆడే అవకాశం లభించింది. అందులో 1 పరుగు మాత్రమే చేశాడు. ఇక ఐపీఎల్ 2022 కోసం తన బేస్ ప్రైజ్‌ను రూ. 40 లక్షలుగా ఉంచాడు.
Base Price: INR 40 Lac
Sold For: INR 8.25 Crore @mipaltan bring Tim David on board in some style! 👏 😎#TATAIPLAuction @TataCompanies pic.twitter.com/F1p13yAWq7
— IndianPremierLeague (@IPL) February 13, 2022
టిమ్ డేవిడ్ ఆస్ట్రేలియా తరఫున ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు. అయితే ఫ్రాంచైజీ క్రికెట్లో మాత్రం అదరగొట్టాడు. బిగ్ బాష్, పాకిస్థాన్ సూపర్ లీగ్, టీ20 బ్లాస్ట్, ది హండ్రెడ్ టోర్నమెంట్‌లలో సత్తాచాటాడు. బ్యాటర్, పార్ట్ టైమ్ ఆఫ్ స్పిన్నర్‌గా తనదైన ముద్ర వేశాడు. పీఎస్‌ఎల్‌లో ముల్తాన్ సుల్తాన్స్ తరపున 6 ఇన్నింగ్స్‌లలో 207 స్ట్రైక్ రేట్‌తో 197 పరుగులు చేశాడు. అందులో 18 సిక్సర్లు ఉండడం విశేషం. డేవిడ్ తన టీ20 కెరీర్‌లో 84 మ్యాచ్‌లు ఆడి 1884 పరుగులు చేశాడు. అందుకే అతడికి అంత ధర వచ్చింది.
Also Read: IPL 2022 Auction: సన్‌రైజర్స్‌లోకి ముగ్గురు ఆల్‌రౌండర్‌లు.. ఇక ప్రత్యర్దులకి చుక్కలే!!
Also Read; IPL Auction 2022: ఈ ఏడాది ఆడకున్నా.. ఆ స్టార్ ఆటగాడిపై కోట్లు కుమ్మరించిన ముంబై! కారణం ఏంటంటే?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook