IPL 2022 Auction: సన్‌రైజర్స్‌లోకి ముగ్గురు ఆల్‌రౌండర్‌లు.. ఇక ప్రత్యర్దులకి చుక్కలే!!

IPL Mega Auction 2022 Live Updates: మొదటి రోజు వాషింగ్టన్ సుందర్‌ను తీసుకున్న సన్‌రైజర్స్.. రెండో రోజు మార్కో జాన్సెన్, రొమారియో షెఫెర్డ్‌, సీన్ అబాట్ లాంటి ముగ్గురు ఆల్‌రౌండర్‌లను తీసుకుంది. 

Written by - ZH Telugu Desk | Last Updated : Feb 13, 2022, 07:02 PM IST
  • సన్‌రైజర్స్‌లోకి ముగ్గురు ఆల్‌రౌండర్‌లు
  • షెఫెర్డ్ కోసం భారీగానే ప్రయత్నించిన సన్‌రైజర్స్
  • జాన్సెన్‌ను రూ.4.2 కోట్లకు కొన్న సన్‌రైజర్స్‌
IPL 2022 Auction: సన్‌రైజర్స్‌లోకి ముగ్గురు ఆల్‌రౌండర్‌లు.. ఇక ప్రత్యర్దులకి చుక్కలే!!

SRH buy All Rounders Marco Jansen, Romario Shepherd and Sean Abbott: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2022 మెగా వేలం రెండో రోజులో సన్‌రైజర్స్ హైదరాబాద్ వరుసగా ఆల్‌రౌండర్‌లను తీసుకుంది. మొదటి రోజు వాషింగ్టన్ సుందర్‌ను తీసుకున్న సన్‌రైజర్స్.. రెండో రోజు మార్కో జాన్సెన్, రొమారియో షెఫెర్డ్‌, సీన్ అబాట్ లాంటి ముగ్గురు ఆల్‌రౌండర్‌లను తీసుకుంది. ఈ ముగ్గురు కూడా మంచి ఆల్‌రౌండర్‌లే. ఈ ముగ్గురిలో ఇద్దరు తుది జట్టులో ఉండడం ఖాయంగా కనిపిస్తోంది. తనదైన రోజున వీరు చెలరేగితే.. ప్రత్యర్దులకి చుక్కలే కనిపిస్తాయి. 

మార్కో జాన్సెన్‌ను సన్‌రైజర్స్ హైదరాబాద్ రూ.4.2 కోట్లతో కొనుగోలు చేసింది. ముంబై ఇండియన్స్ జట్టుతో పోటీపడి మరీ దక్కించుకుంది. మార్కో ఇటీవల కాలంలో దక్షిణాఫ్రికా జట్టులో సంచలన ప్రదర్శనలు చేశాడు. ఎడమ చేతివాటం పేస్ బౌలింగ్, కుడి చేతివాటం బ్యాటింగ్‌తో జాన్సెన్ ఇటీవల టీమిండియాపై అద్భుత ప్రదర్శన చేశాడు. సొంతగడ్డపై టీమిండియాను టెస్టు సిరీస్‌లో ఓడించడంలో జాన్సెన్ కీలకపాత్ర పోషించాడు. 3 టెస్టుల్లో 19 వికెట్లు పడగొట్టి అందరి దృష్టిని ఆకర్షించాడు. బ్యాటింగ్‌లోనూ ధాటిగా ఆడగలగడం అతడి ప్రత్యేకత. 

భారీ హిట్టరయిన విండీస్ ప్లేయర్ రొమారియో షెఫెర్డ్ కోసం సన్‌రైజర్స్ హైదరాబాద్ భారీగానే ప్రయత్నించింది. షెఫెర్డ్ కోసం రాజస్థాన్ రాయల్స్, చెన్నై సూపర్ కింగ్స్‌తో పోటీపడి మరీ రూ.7.75 కోట్ల భారీ ధరకు కైవసం చేసుకుంది. షెఫర్ట్ కోసం చెన్నై ఆసక్తి చూపగా.. వేలం  రూ.5 కోట్లు ధాటింది. అయినా సన్‌రైజర్స్ వెనక్కి తగ్గలేదు. చెన్నై తప్పుకోగా.. రాజస్థాన్ ఎంట్రీ ఇచ్చింది. అయినా సన్‌రైజర్స్ తగ్గేదేలే అంటూ ముందుకు దూసుకెళ్లి కైవసం చేసుకుంది. ఇటీవల ఇంగ్లండ్‌తో జరిగిన టీ20 సిరీస్‌లో అదరగొట్టాడు. బ్యాటింగ్, బౌలింగ్‌తో సత్తా చాటాడు.

ఆస్ట్రేలియా పేస్ ఆల్‌రౌండర్‌ సీన్ అబాట్‌ను సన్‌రైజర్స్ హైదరాబాద్ రూ. 2.40 కోట్లకు కొనుగోలు చేసింది. అతడి కనీస ధర 75 లక్షలు కాగా.. ప్రాంఛైజీలు పోటీపడడంతో చివరకు అతడిని హైదరాబాద్ 2.40లకు దక్కించుకుంది. బిగ్ బాష్ లీగ్ చరిత్రలో సీన్ అబాట్ రెండో అత్యధిక వికెట్లు తీసిన రికార్డును కలిగి ఉన్నాడు. ఇప్పటివరకు సిడ్నీ థండర్ మరియు సిడ్నీ సిక్సర్స్ తరపున ఆడి ఔరా అనిపించాడు. ఇక 2015లో బెంగళూరు తరఫున ఆడిన అబాట్‌ నిరాశపరిచాడు. 

Aslo Read: IPL Auction 2022: ఈ ఏడాది ఆడకున్నా.. ఆ స్టార్ ఆటగాడిపై కోట్లు కుమ్మరించిన ముంబై! కారణం ఏంటంటే?

Also Read: Tilak Varma: హైదరాబాద్‌ యువ ఆటగాడిపై కనక వర్షం.. భారీ ధరకు కొనుగోలు చేసిన ముంబై!!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook 

Trending News