ఎంఎస్ ధోని వారసుడిగా పేరు తెచ్చుకున్న రిషబ్ పంత్ కాదని దినేష్ కార్తీక్ ను తీసుకోవడంతో విమర్శలకు దారి తీసింది. కారణం వికెట్ కీపింగ్ తో పాటు అటాకింగ్ బ్యాటింగ్‌తో మిడిల్ ఆర్డర్లో విలువైన బ్యాట్స్‌మన్‌గా పంత్ పేరు తెచ్చుకున్నాడు. ఆసీస్ లాంటి కఠిన పిచ్ ల పై అద్బుత ఆటతీరు కనబర్చి అందరినీ ఆకట్టుకున్నాడు. అందరూ ధోనీకి ఆల్టర్ నేట్ కీపర్ గా పంత్ ను ఎంపిక చేస్తారనుకున్నారు అంతా..తీరు సెలక్టర్లు మాత్రం అంతగా ఫాంలో లేని దినేష్ కార్తీక్ ను ఎంపిక చేస్తూ అనూహ్య నిర్ణయం తీసుకున్నారు
భారత క్రికెట్ జట్టులో ఎంతో అనుభవం ఉన్న ఆటగాడు దినేశ్ కార్తీక్ . అయితే వికెట్ కీపర్ బ్యాట్స్ మెన్ గా ధోని క్లిక్ అవుడంతో కార్తీక్‌కు గుర్తింపు రాలేదు. ధోనీ ఫాంలో ఉన్నంత కాలం అతనికి అవకాశాలూ అంతంత మాత్రమే వచ్చాయి. ధోని క్రమ క్రమంగా క్రికెట్ నుంచి తప్పుకొంటున్న సమయంలో ఇప్పుడైనా జట్టుకు సేవలందించాలని అనుకున్నాడు. అదే సమయంలో ఎంఎస్ ధోని వారసుడిగా పేరు తెచ్చుకున్న రిషబ్ పంత్ రూపంలో పోటీ ఎదురైంది. అనుభవంలో కార్తీక్ మెరుగ్గా కనిపించినా అటాకింగ్ బ్యాటింగ్‌తో మిడిల్ ఆర్డర్లో కావాల్సిన బ్యాట్స్‌మన్‌గా పంత్ పేరు తెచ్చుకున్నాడు.
ఇదే సమయంలో వరల్డ్ కప్ ముంచుకు రావడం ..రిషబ్ పంత్ ఫాంలో ఉండటం వంటి పరిణామాలు దినేష్ కార్తీక్ కు అవకాశాలు దెబ్బకొట్టే పరిస్థితి నెలకొన్నాయి. కానీ సెలక్టర్లు మాత్రం పంత్ ను పక్కన పెట్టి ధోనీకి ప్రత్యామ్నాయంగా రిషబ్‌ను తీసుకోవాలని నిర్ణయించింది. అయితే ఈ అనూహ్య నిర్ణయం వెనుక కోహ్లీ హస్తం ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. సెలక్షన్ బృందంలో ఉన్న ఐదుగురు సభ్యుల్లో నలుగురు పంత్ వైపే మొగ్గు చూపించగా కోహ్లీ మాత్రం కార్తీక్ వైపు ఉన్నాడట. కార్తీక్‌ను తీసుకుంటే వచ్చే లాభాలు తెలియజేసి సెలక్షన్ బృందం కోహ్లీ కన్విన్స్ చేశాడట. దీంతో కెప్టెన్ హోదాలో కోహ్లీ ఉన్న దీంతో కోహ్లీతో సెలక్షన్ బృందం మొత్తం కోహ్లీ అభిప్రాయాన్ని గౌరవించి దినేష్ కు వైపు మొగ్గు చూపినట్లు తెలిసింది