IPL 2022: ఐపీఎల్ 2022లో కొత్తగా చేరిన అహ్మదాబాద్, లక్నో ఫ్రాంచైజీల రిటైన్ ఆటగాళ్ల జాబితా ప్రకటించాయి. లక్నో ఫ్రాంచైజీ కెప్టెన్‌గా కేఎల్ రాహుల్ నియామకం ఖరారైంది.
ఐపీఎల్ 2022లో చాలా మార్పులు వస్తున్నాయి. లక్నో, అహ్మదాబాద్ జట్లు కొత్తగా ఎంట్రీ ఇస్తున్న విషయం తెలిసిందే. పంజాబ్ కింగ్స్ ఎలెవన్ కెప్టెన్‌గా వ్యవహరించిన కేఎల్ రాహుల్‌ని లక్నో ఫ్రాంచైజీ తమ కెప్టెన్‌గా ప్రకటించింది. కేఎల్ రాహుల్ నియామకాన్ని ఖరారు చేస్తూ మరో ముగ్గురు ఆటగాళ్ల పేర్లను ప్రకటించింది. ఆస్ట్రేలియా ఆల్ రౌండర్ మార్కస్ స్టోయినిస్, ఇండియన్ లెగ్ స్పిన్నర్ రవి బిష్ణోయ్‌లను కొనుగోలు చేసింది. ఏడు వేల కోట్లతో ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత ఖరీదైన ఫ్రాంచైజీగా ఉన్న లక్నో జట్టుకు గోయెంకా గ్రూప్ ప్రాతినిధ్యం వహిస్తోంది. కేఎల్ రాహుల్‌ను (KL Rahul) 17 కోట్లకు కొనుగోలు చేసింది.
మార్కస్ స్టోయినిస్‌పై కూడా లక్నో ఫ్రాంచైజీ (Lucknow Franchisee) భారీగానే ఖర్చు పెట్టింది. 9.2 కోట్ల వరకూ చెల్లించింది. రవి బిష్ణోయ్‌ను 4 కోట్లకు కొనుగోలు చేసింది. రాహుల్ రాకతో లక్నో ఫ్రాంచైజీ జట్టుకు బలమైన ఓపెనర్ లభించడమే కాకుండా మంచి వికెట్ కీపర్ లోటు పూర్తయింది. ఆస్ట్రేలియాకు చెందిన ఆల్ రౌండర్ మార్కస్ స్టోయినిస్‌ను లక్నో ఫ్రాంచైజీ రెండవ ఆటగాడిగా ఎంచుకోవడం విశేషం. మార్కస్ స్టోయినిస్ గతంలో ఢిల్లీ కేపిటల్స్‌కు ఆడాడు. ఇక బెస్ట్ అన్‌క్యాప్డ్ ప్లేయర్ రవి బిష్ణోయ్‌పై ఏకంగా 4 కోట్లు ఖర్చు పెట్టడం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. అయితే అద్భుతమైన గుగ్లీకు రవి బిష్ణోయ్ ప్రత్యేకం.
Also read: IND vs SA : సఫారీలదే వన్డే సిరీస్.. రెండో వన్డేలోనూ భారత్ ఓటమి
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook