SRH vs MI: ఎస్‌ఆర్‌హెచ్‌పై విజయం, ప్లే ఆఫ్‌కు దూరం

SRH vs MI: ఐపీఎల్ 2021 లో ముంబై ఇండియన్స్ కధ ముగిసింది. సన్ రైజర్స్ హైదరాబాద్‌పై విజయం సాధించినా..ప్లే ఆఫ్‌కు చేరుకోలేకపోయింది. భారీ స్కోరు సాధించినా..ప్లే ఆఫ్‌కు దూరమైంది. 

Written by - Md. Abdul Rehaman | Last Updated : Oct 9, 2021, 10:24 AM IST
SRH vs MI: ఎస్‌ఆర్‌హెచ్‌పై విజయం, ప్లే ఆఫ్‌కు దూరం

SRH vs MI: ఐపీఎల్ 2021 లో ముంబై ఇండియన్స్ కధ ముగిసింది. సన్ రైజర్స్ హైదరాబాద్‌పై విజయం సాధించినా..ప్లే ఆఫ్‌కు చేరుకోలేకపోయింది. భారీ స్కోరు సాధించినా..ప్లే ఆఫ్‌కు దూరమైంది. 

ఐపీఎల్ 2021(IPL2021)దిగిన ముంబై ఇండియన్స్..నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 235 పరుగులు సాధించింది. ఐపీఎల్ చరిత్రలో ఇదే అత్యధిక స్కోరుగా ఉంది. 

ఐపీఎల్‌ 2021లో భాగంగా నేడు ముంబై ఇండియన్స్‌, ఎస్‌ఆర్‌హెచ్‌ మధ్య కీలకమ్యాచ్‌ జరగనుంది. ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన ముంబై ఇండియన్స్‌ బ్యాటింగ్‌ ఎంచుకుంది. కాగా ఎస్‌ఆర్‌హెచ్‌పై 171 పరుగుల తేడాతో విజయం సాధిస్తే ముంబై ప్లేఆఫ్స్‌ చేరుకుంటుంది. ఇక ముంబై ఇండియన్స్‌(Mumbai Indians)13 మ్యాచ్‌ల్లో 6 విజయాలు.. ఏడు ఓటములతో 12 పాయింట్లతో ఆరో స్థానంలో ఉంది. ఇషాన్ కిషన్ , సూర్యకుమార్ యాదవ్ చెలరేగి ఆడటంతో ముంబై ఇండియన్స్ భారీ స్కోరు సాధించగలిగింది. ఇషాన్ 84 పరుగులు, సూర్యకుమార్ యాదవ్ 82 పరుగులు సాధించారు. 236 పరుగుల లక్ష్యంతో బరిలో దిగిన ఎస్ఆర్‌హెచ్ జట్టు 20 ఓవర్లలో 98 వికెట్ల నష్టానికి 193 పరుగులు చేసింది. ఫలితంగా 171 పరుగుల తేడాతో గెలిచి ప్లే ఆఫ్‌కు చేరుకోవాలనుకున్న ముంబై ఇండియన్స్ ఆశలు నిరాశగా మారాయి. కేవలం 42 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఒకే మ్యాచ్‌లో ఐదు క్యాచ్‌లతో సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు(Sunrisers Hyderabad)చెందిన మొహమ్మద్ నబీ అరుదైన ఘనత సాధించారు. 

Also read: SRH vs MI match score live updates: సన్ రైజర్స్ vs ముంబై ఇండియన్స్.. ఎవరి బలం ఎంత ?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook

Trending News