క్రికెటర్ భువనేశ్వర్‌కు షాకిచ్చిన భార్య

అలా ఫొటోలు దిగిన ప్రతిసారి.. అమ్మాయికి అంత దగ్గరగా చనువుగా మెలగడం అవసరమా అని ప్రశ్నించేదని.. అమ్మాయిలు అలా దగ్గరికి నేనేం చేయగలనని సర్దిచెప్పేవాడినని వెల్లడించాడు. 

Updated: Mar 22, 2020, 02:16 PM IST
క్రికెటర్ భువనేశ్వర్‌కు షాకిచ్చిన భార్య

భారత స్టార్ పేసర్ భువనేశ్వర్‌ మైదానంలో ప్రత్యర్థి జట్టు బ్యాట్స్‌మెన్‌కు చెమటలు పట్టిస్తాడు. అయితే భువీకి మాత్రం పెళ్లైన కొత్తలోనే ఆయన భార్య షాకిచ్చింది. ఆ విషయాన్ని భువనేశ్వర్ తాజాగా షేర్ చేసుకున్నాడు. ఉత్తరప్రదేశ్‌కు చెందిన భువనేశ్వర్ స్వింగ్ బౌలింగ్‌కు పెట్టింది పేరు. జట్టులో చోటు సంపాదించుకున్న భువీ.. నుపుర్ నగర్‌తో ప్రేమాయణం సాగించి వివాహం చేసుకున్నాడు. అయితే పెళ్లైన కొత్తలో ఓ రోజు భార్య నుపుర్ భువీ ఫేస్ బుక్ అకౌంట్ పాస్ వర్డ్ అడిగిందట. చెప్పకుండా ఏదో విధంగా తప్పించుకున్నట్లు చెప్పాడు భువీ.

బికినీలో సెగలురేపుతోన్న Sunny Leone

కానీ అనూహ్యంగా ఆ మరుసటి రోజు నీ ఫేస్ బుక్ పాస్‌వర్డ్ ఇదేనా అంటూ నపుర్ చెప్పడంతో భువీకి ఊహించని షాక్ ఎదురైంది. తను నా ఫేస్‌బుక్ అకౌంట్ హ్యాక్ చేసింది. ఇక అప్పటినుంచీ తాను ఫేస్ బుక్ వాడటం లేదని భార్యతో తన ఫన్నీ రిలేషన్, సంభాషణను తాజాగా షేర్ చేసుకున్నాడు. మహిళా అభిమానులతో తాను ఫొటోలు దిగితే నుపుర్‌కు ఈర్ష్యగా ఉండేదన్నాడు. అలా ఫొటోలు దిగిన ప్రతిసారి.. అమ్మాయికి అంత దగ్గరగా చనువుగా మెలగడం అవసరమా అని ప్రశ్నించేదని.. అమ్మాయిలు అలా దగ్గరికి నేనేం చేయగలనని సర్దిచెప్పేవాడినని వెల్లడించాడు. షాకింగ్.. కరోనాతో యువ కోచ్ మృతి

నుపుర్ సైతం భర్త భువీ టాలెంట్‌ చూసి గర్వపడేదాన్నని చెప్పింది. 2012లో పాకిస్థాన్‌పై మ్యాచ్‌లో భువీ తొలి మ్యాచ్ ఆడాడు. అప్పుడు తాను హాస్టల్ ఉన్నానని, అందరు భువీ బౌలింగ్ చూసి మెచ్చుకున్నారని.. మా రిలేషన్ వారికి తెలియదు అంటూ నవ్వేసింది. 15వ నెంబర్ జెర్సీ బౌలర్‌కు బంతిని ఇవ్వాలని వాళ్లు అనడంతో భువీకి ఉన్న డిమాండ్ నాకు చాలా సంతోషాన్నిచ్చిందని వివరించింది.   జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here.. 

ఇస్మార్ట్ భామ అందాల ‘నిధి’ Bold photos