PBKS Vs DC Dream11 Team Tips: నేడే రిషభ్ పంత్ రీఎంట్రీ.. పంజాబ్‌తో ఢిల్లీ ఫైట్.. హెడ్ టు హెడ్ రికార్డులు, డ్రీమ్11 టీమ్ టిప్స్ ఇలా..

Punjab Kings vs Delhi Capitals Pitch Report and Head to Head Records: ఐపీఎల్‌లో నేడు పంజాబ్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్ జట్లు తలపడునున్నాయి. ఢిల్లీ కెప్టెన్ రిషభ్ పంత్ రీఎంట్రీ ఇస్తుండడంతో అభిమానులు ఈ మ్యాచ్‌ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. డ్రీమ్11 టీమ్‌ను ఇలా ఎంచుకోండి.   

Written by - Ashok Krindinti | Last Updated : Mar 23, 2024, 01:10 PM IST
PBKS Vs DC Dream11 Team Tips: నేడే రిషభ్ పంత్ రీఎంట్రీ.. పంజాబ్‌తో ఢిల్లీ ఫైట్.. హెడ్ టు హెడ్ రికార్డులు, డ్రీమ్11 టీమ్ టిప్స్ ఇలా..

Punjab Kings vs Delhi Capitals Pitch Report and Head to Head Records: ఐపీఎల్ వేట మొదలైంది. తొలి మ్యాచ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ చెన్నై విజయంతో టోర్నీని ఆరంభించింది. ఆర్‌సీబీపై 6 వికెట్ల తేడాతో గెలుపొంది.. పాయింట్ల ఖాతాను ఓపెన్ చేసింది. నేడు పంజాబ్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్ తలపడనున్నాయి. రోడ్డు ప్రమాదం నుంచి పూర్తిగా కోలుకున్న రిషభ్ పంత్.. దాదాపు ఏడాదిన్నర తరువాత మైదానంలోకి రీఎంట్రీ ఇస్తున్నాడు. అందరీ కళ్లు పంత్‌పై ఉన్నాయి. శిఖర్ ధావన్ నేతృత్వంలో పంజాబ్ బరిలోకి దిగుతోంది. ధావన్ కూడా చివరగా గత సీజన్‌ ఐపీఎల్‌లోనే మ్యాచ్ ఆడాడు. మొహాలీలోని మహారాజా యదవీంద్ర సింగ్ క్రికెట్ స్టేడియం వేదికగా మధ్యాహ్నం 3:30 గంటలకు  మ్యాచ్‌ ప్రారంభంకానుంది. హెడ్ టు హెడ్ రికార్డులు, పిచ్ రిపోర్ట్, డ్రీమ్11 టీమ్ టిప్స్ మీ కోసం..

Also Read: MS Dhoni: ధోని మరీ ఇంత మంచోడు ఏంటి భయ్యా.. 5 సెకన్ల వీడియోతో అందరి హృదయాలను కొల్లగొట్టిన మిస్టర్ కూల్..

ఢిల్లీ, పంజాబ్ జట్లు ఐపీఎల్‌లో ముఖాముఖి 32 మ్యాచ్‌ల్ల్ తలపడ్డాయి. రెండు జట్లు కూడా చెరో 16 మ్యాచ్‌ల్లో విజయం సాధించాయి. సాధారణంగా మొహాలీ పిచ్ పేసర్లకు అనుకూలంగా ఉంటుంది. అయితే గత కొన్నేళ్లుగా పరిస్థితి మారింది. బ్యాట్స్‌మెన్ ఇక్కడ భారీగా పరుగులు చేస్తున్నారు. మొహాలీలో ఈరోజు వేడిగా ఉంటుంది. చాలా వరకు మేఘావృతమై ఉంటుంది. కానీ వర్షం పడే అవకాశం లేదు.

లైవ్ స్ట్రీమింగ్ ఎక్కడ..?

==> మ్యాచ్: చెన్నై సూపర్ కింగ్స్ VS రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 
==> ఎప్పుడు: శనివారం మధ్యాహ్నం 3:30 గంటలకు.
==> వేదిక: మహారాజా యదవీంద్ర సింగ్ క్రికెట్ స్టేడియం, మొహలీ
==> స్ట్రీమింగ్ ఎక్కడ చూడాలి: JioCinema యాప్, వెబ్‌సైట్‌లో ఉచితంగా చూడొచ్చు.

తుది జట్లు ఇలా.. (అంచనా)

ఢిల్లీ క్యాపిటల్స్: డేవిడ్ వార్నర్, మిచెల్ మార్ష్, రిషభ్‌ పంత్ (కెప్టెన్), ట్రిస్టియన్ స్టబ్స్, లలిత్ యాదవ్, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, ఇషాంత్ శర్మ, ముఖేష్ కుమార్, నోకియా, ఖలీల్ అహ్మద్.

పంజాబ్ కింగ్స్: ప్రభ్‌సిమ్రాన్ సింగ్, శిఖర్ ధావన్ (కెప్టెన్), అథర్వ తైడే, లియామ్ లివింగ్‌స్టోన్, జితేష్ శర్మ (వికెట్ కీపర్), అశుతోష్ శర్మ, సికందర్ రజా, సామ్ కర్రాన్, హర్షల్ పటేల్, అర్ష్‌దీప్ సింగ్, కగిసో రబాడ.

డ్రీమ్11 టీమ్ టిప్స్.. (PBKS Vs DC Dream11 Team)

వికెట్ కీపర్: రిషభ్ పంత్, జితేష్ శర్మ
బ్యాట్స్‌మెన్: డేవిడ్ వార్నర్ (కెప్టెన్), శిఖర్ ధావన్, అథర్వ తైడే
ఆల్‌ రౌండర్లు: సామ్ కర్రాన్, లియామ్ లివింగ్‌స్టోన్ (వైస్ కెప్టెన్), సికందర్ రాజా
బౌలర్లు: హర్షల్ పటేల్, కగిసో రబాడ, కుల్దీప్ యాదవ్.

Also Read: Kidnap Drama: 'ఇది బిగనర్స్‌ మిస్టేక్స్‌ చూసుకోవాలి కదా!'.. బెడిసికొట్టిన యువతి కిడ్నాప్‌ డ్రామా

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News

By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.

x