Virat Kohli-Chahal: కోహ్లీ సమస్యంతా అదే.. విరాట్‌కు బాల్‌ వేయడానికి ఏ బౌలర్‌ ఇష్టపడడు: చహల్‌

Yuzvendra Chahal about Virat Kohli Form. విరాట్ కోహ్లీ విమర్శలపై టీమిండియా మణికట్టు స్పిన్నర్ యుజువేంద్ర చహల్‌ తాజాగా  స్పందించాడు.  

Written by - P Sampath Kumar | Last Updated : Aug 20, 2022, 01:03 PM IST
  • కోహ్లీ సమస్యంతా అదే
  • విరాట్‌కు బాల్‌ వేయడానికి ఏ బౌలర్‌ ఇష్టపడడు
  • మూడు ఏళ్లుగా మూగబోయిన కోహ్లీ బ్యాట్
Virat Kohli-Chahal: కోహ్లీ సమస్యంతా అదే.. విరాట్‌కు బాల్‌ వేయడానికి ఏ బౌలర్‌ ఇష్టపడడు: చహల్‌

Yuzvendra Chahal about Virat Kohli Form: టీమిండియా మాజీ కెప్టెన్, రన్‌మెషిన్‌ విరాట్ కోహ్లీ గత మూడు ఏళ్లుగా పరుగులు చేయలేక సతమతమవుతున్నాడు. ఒక్కప్పుడు మంచినీళ్ల ప్రాయంగా హాఫ్ సెంచరీ, సెంచరీలు చేసే కోహ్లీ బ్యాట్ మూగబోయింది. మూడు ఫార్మాట్లలో ఆడపాదడపా ఇన్నింగ్స్‌లు తప్ప ఒక్క సెంచరీ బాధలేదు. అంతర్జాతీయ క్రికెట్‌లో కింగ్ కోహ్లీ సెంచరీ లేకుండానే వెయ్యి రోజులు పూర్తి చేసుకున్నాడు. దాంతో కోహ్లీ ఆట తీరుపై విమర్శలు వ్యక్తమవుతున్న విషయం తెలిసిందే. ఈ విమర్శలపై టీమిండియా మణికట్టు స్పిన్నర్ యుజువేంద్ర చహల్‌ తాజాగా  స్పందించాడు.

ఓ క్రీడాఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో యుజువేంద్ర చహల్‌ మాట్లాడుతూ... 'ఓ ప్లేయర్‌కి టీ20ల్లో 50 + సగటు ఉన్నప్పుడు.. రెండు టీ20 ప్రపంచకప్‌లలో మ్యాన్‌ ఆఫ్ ది మ్యాచ్‌ అవార్డుకు ఎంపికైనప్పుడు.. అన్ని ఫార్మాట్లలో 70 సెంచరీలు చేసినప్పుడు.. అందరూ అతడి సగటు రన్‌ రేట్ ఎలా ఉందని మాత్రమే చూడాలి. అయితే విరాట్ కోహ్లీ విషయంలో మాత్రం బిన్నంగా ఉంది. మనమందరం కేవలం కోహ్లీ సెంచరీల గురించే ఆలోచిస్తున్నాం. అందుకే ఈ సమస్యంతా. జట్టుకు అవసరమైనప్పుడు 60-70 పరుగులతో మంచి ఇన్నింగ్స్ ఆడాడు. వాటి గురించి మనం మాట్లాడుకోము' అని అన్నాడు. 

'విరాట్ కోహ్లీ ఎంత గొప్ప ఆటగాడో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అతడు క్రీజులో ఉంటే పరుగుల వరద పారాల్సిందే. విరాట్ క్రీజులో ఉండి 15-20 పరుగులు చేసిన తర్వాత.. కింగ్ కోహ్లీకి బాల్‌ వేయడానికి ఏ బౌలర్‌ ఇష్టపడడు. అంతలా కోహ్లీ ప్రభావం బౌలర్లపై ఉంటుంది. విరాట్ త్వరలోనే భారీ ఇన్నింగ్స్ ఆడతాడు' అని యుజువేంద్ర చహల్‌ ఆశాభావం వ్యక్తం చేశాడు. కోహ్లీతో చహల్‌కు మంచి అనుబంధం ఉన్న విషయం తెలిసిందే. ఐపీఎల్ టోర్నీలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుకు విరాట్ సారథిగా ఉన్నప్పుడు చహల్‌ 8ఏళ్ల పాటు ప్రాతినిథ్యం వహించాడు.

Also Read: బీఎస్ఎన్ఎల్ సూపర్ బ్రాడ్‌బ్యాండ్‌ ప్లాన్‌.. 75 రోజులకు రూ. 275 మాత్రమే!

Also Read: నైట్ వేర్‌లో క్లివేజ్ అందాలు.. సెగలు పెట్టిస్తున్న డింపుల్ హయాతి!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

 

Trending News

By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.

x