Kapil Dev says I Will Slap Rishabh Pant very Hard: టీమిండియా స్టార్ క్రికెటర్ రిషబ్ పంత్.. 2022 డిసెంబర్ 30న రోడ్డు ప్రమాదంకు గురైన విషయం తెలిసిందే. న్యూ ఇయర్ వేడుకల సందర్భంగా కుటుంబసభ్యలను కలిసేందుకు ఢిల్లీ నుంచి ఉత్తరాఖండ్ వెళ్తుండగా పంత్ కారు అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టింది. కారులో ఒక్కసారిగా మంటలు చెలరేగగా.. కొందరి సాయంతో విండో పగలగొట్టుకుని పంత్ బయటకు దూకేశాడు. ఈ ప్రమాదంలో పంత్ తల, మోకాలికి తీవ్ర గాయాలయ్యాయి.
రిషబ్ పంత్‌కు శస్త్రచికిత్సలు విజయవంతంగా పూర్తయ్యాయి. ముంబైలోని ధీరూభాయి అంబానీ ఆసుపత్రిలో పంత్ చికిత్స తీసుకుంటున్నాడు. పూర్తిగా కోలుకొని తిరిగి మైదానంలోకి అడుగుపెట్టేందుకు కనీసం 6నెలల సమయం పట్టే అవకాశం ఉందని ఇప్పటికే బీసీసీఐ అధికారులు వెల్లడించారు. ఈ నేపథ్యంలో ఐపీఎల్ 2023కి అతడు దూరం కానున్నాడు. ఇక కోలుకొని, ఫిట్‌నెస్ సాధిస్తేనే.. ఈ ఏడాది చివర్లో జరిగే వన్డే ప్రపంచకప్ 2023లో ఆడే అవకాశం ఉంది.
రిషబ్ పంత్ గురించి భారత మాజీ కెప్టెన్ కపిల్ దేవ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పంత్ పూర్తిగా కోలుకోగానే అతడి దగ్గరకెళ్లి గట్టిగా ఓ చెంప దెబ్బ కొట్టాలనుందన్నారు. పంత్ వల్లే టీమిండియాలో గందరగోళం ఏర్పడిందని పేర్కొన్నారు. అన్ కట్ ఛానల్‌తో కపిల్ దేవ్ మాట్లాడుతూ... 'రిషబ్ పంత్ అంటే నాకు చాలా ఇష్టం. నాకు ఎంతో ప్రేమ ఉంది. అలాగే కోపంగానూ ఉంది. పంత్ త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నా. కోలుకోగానే అతడి ఇంటికెళ్లి గట్టిగా ఓ చెంప దెబ్బ కొట్టి.. జాగ్రత్తగా ఉండమని చెబుతా. నువ్వు లేకపోవడంతో జట్టు బలం తగ్గింది అని చెబుతా' అని అన్నారు.
'రిషబ్ పంత్ ప్రపంచంలోని ప్రేమనంతా పొందాలి. దేవుడు అతడికి మంచి ఆరోగ్యాన్ని ప్రసాదించాలని వేడుకుంటున్నా. పిల్లలు తప్పు చేస్తే.. చెంపదెబ్బ కొట్టే హక్కు తల్లిదండ్రులకు ఉన్నట్లుగానే నేను పంత్‌కు చెంపదెబ్బ కొట్టాలనుకుంటున్నా. నేటి యువకులు ఎందుకు ఇలాంటి తప్పులు చేస్తున్నారు?. అలాంటి వారికి చెంప దెబ్బలు పడాలి' కపిల్ దేవ్ పేర్కొన్నారు. పంత్ లేకుండానే బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ 2023ని భారత్ ఆడనుంది. పంత్ స్థానంలో ఇషాన్ కిషన్, కేఎస్ భరత్‌లను బీసీసీఐ జట్టులోకి తీసుకుంది. అయితే ఏ మాత్రం అనుభవం లేని వీరు ఎలా రాణిస్తారో చూడాలి.
Also Read: WTC 2023 Final Date: డబ్ల్యూటీసీ ఫైనల్ డేట్ వచ్చేసింది.. స్పిన్నర్ల చేతిలోనే భారత్ భవితవ్యం!
Also Read: Nissan Magnite Price: చౌకైన, సూపర్ లుకింగ్ ఎస్‌యూవీ.. ఫీచర్లు కూడా అదుర్స్! టాటా పంచ్ కంటే తక్కువ ధర
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.