శ్రీలంక స్టార్ క్రికెటర్ అరెస్ట్

ఓ వ్యక్తి మరణానికి కారణమయ్యాడని శ్రీలంక స్టార్ ‌క్రికెటర్‌ను కొలంబో పోలీసులు అరెస్ట్ చేశారు. క్రికెటర్ (Kusal Mendis Arrested) కారు ఢీకొని సైకిల్‌పై వెళ్తున్న ఓ వృద్ధుడు చనిపోవడంతో పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.

Written by - Shankar Dukanam | Last Updated : Jul 5, 2020, 09:04 PM IST
శ్రీలంక స్టార్ క్రికెటర్ అరెస్ట్

శ్రీలంక స్టార్ క్రికెటర్ కుశాల్ మెండిస్‌ను పోలీసులు అరెస్ట్ (Kusal Mendis Arrested) చేశారు. నేటి ఉదయం రాజధాని కొలంబోలోని పానాదురా ప్రాంతంలో సైకిల్‌పై వెళ్తున్న ఓ వృద్ధుడిని కుశాల్ మెండిస్‌ కారు ఢీకొట్టింది. తీవ్రగాయాలపాలైన ఆ వ్యక్తిని వెంటనే ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ కొద్దిసమయానికే ఆ వృద్ధుడు చనిపోయాడు. కేసు నమోదు చేసుకున్న కొలంబో పోలీసులు కారు స్వాధీనం చేసుకుని, క్రికెటర్ కుశాల్ మెండిస్ ((Kusal Mendis)‌ను అదుపులోకి తీసుకున్నట్లు ఓ అధికారి వెల్లడించారు.  విరాట్ కోహ్లీపై పిర్యాదు..

ప్రమాదం జరిగిన సమయంలో కుశాల్ మెండిస్ మద్యం సేవించాడా లేదా అనే దానిపై స్పష్టత రావాల్సి ఉంది. సాయంత్రం స్థానిక మెజిస్ట్రేట్ ఎదుట మెండిస్‌ను హాజరుపరిచారు. లాక్‌డౌన్ తర్వాత ప్రారంభమయ్యే సిరీస్‌లకు బ్యాట్స్‌మెన్ కుశాల్ మెండిస్‌ను ఎంపిక చేయడం తెలిసిందే. మార్చిలో ఇంగ్లాండ్‌తో టెస్ట్ సిరీస్‌కు మెండిస్ ఎంపిక కాగా, కరోనా వైరస్ కారణంగా సిరీస్ రద్దు కావడం తెలిసిందే. కుశాల్ మెండిస్ 44 టెస్టులు, 76 వన్డేల్లో లంక జాతీయ జట్టుకు ప్రాతినిథ్యం వహించాడు.  RGV ‘నగ్నం’ హీరోయిన్ స్వీటీ Hot Photos 

కాగా, 2001లో మాజీ స్పిన్నర్ కౌశల్ లోకురాచ్చి కారుతో ఢీకొట్టడంతో ఓ మహిళ చనిపోయింది. ఈ కేసులో న్యాయస్థానం ఆ క్రికెటర్‌కు నాలుగేళ్ల జైలుశిక్ష విధించింది. లంకలో ప్రతి ఏడాది 3000 మంది రోడ్డు ప్రమాదాలలో మరణిస్తున్నారు.  జీ హిందుస్తాన్ టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan live here..    
 బికినీలో బిగ్‌బాస్ రన్నరప్.. వామ్మో అంత హాట్‌గా!

Trending News