T20 World Cup 2022, Rahul Dravid on Jasprit Bumrah Injury: వెన్ను నొప్పితో టీమిండియా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా ప్రస్తుతం జరుగుతున్న దక్షిణాఫ్రికా సిరీస్‌కు దూరమైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అక్టోబర్ 16 నుంచి ఆరంభం అయ్యే టీ20 ప్రపంచకప్ 2022లో బుమ్రా ఆడటం అనుమానంగా మారింది. మెగా టోర్నీలో పేస్ గుర్రం ఆడడం కష్టమే అన్న వార్తలు వస్తున్నాయి. బుమ్రా గాయంపై బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ ఇప్పటికే స్పందించారు. బుమ్రా ఇంకా ప్రపంచకప్ 2022 నుంచి నిష్క్రమించలేదని, గాయంపై ఉత్కంఠ నెలకొందని చెప్పారు.
జస్ప్రీత్ బుమ్రా గాయంపై తాజాగా టీమిండియా హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ స్పందించారు. రెండో టీ20 మ్యాచ్ నేపథ్యంలో శనివారం విలేకరుల సమావేశంలో ద్రవిడ్ మాట్లాడుతూ... 'దక్షిణాఫ్రికాతో టీ20 సిరీస్ నుంచి మాత్రమే జస్ప్రీత్ బుమ్రా తప్పుకున్నాడు. ప్రస్తుతం అతడు బెంగళూరులోని ఎన్‌సీఏలో ఉన్నాడు. ఎన్‌సీఏ వైద్య బృందం పరిశీలించి బుమ్రా పరిస్థితి ఏంటనేది నివేదిక ఇస్తుంది. రాబోయే రెండు మూడు రోజుల్లో ఏం జరుగుతుందో వేచి చూడాలి' అని అన్నారు.
'జస్ప్రీత్ బుమ్రా గత మెడికల్ రిపోర్టులను లోతుగా పరిశీలించ లేదు. నిపుణులు చెప్పే దానిపైనే నేను ఆధారపడతాను. ప్రస్తుతం బుమ్రాను దక్షిణాఫ్రికాతో టీ20 సిరీస్ నుంచి మాత్రమే తప్పించారు. అధికారికంగా ఇప్పటికీ బుమ్రా టీ20 ప్రపంచకప్ 2022 నుంచి వైదొలిగినట్లు కాదు. అనుకూల నిర్ణయం వస్తుందని నేను ఆశిస్తున్నా. బుమ్రా టీ20 ప్రపంచకప్‌లో ఆడాలని కోరుకుంటున్నా' అని హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ పేర్కొన్నారు.
Also Read: బాక్సాఫీస్ వద్ద 'పొన్నియన్ సెల్వన్' ప్రభంజనం.. సినీ చరిత్రలోనే తొలిసారి..!
Also Read: అందాలకు అడ్డుగా పెట్టేసింది.. శ్రియా ఫోటోలు వైరల్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook
బుమ్రా ఎన్‌సీఏలో ఉన్నాడు.. ఇంజ్యూరీ అప్‌డేట్ కోసం వేచిచుస్తునాం: ద్రవిడ్
బుమ్రా ఎన్‌సీఏలో ఉన్నాడు
ఇంజ్యూరీ అప్‌డేట్ కోసం వేచి చుస్తునాం
బుమ్రా గాయంపై ఉత్కంఠ