Ponniyin Selvan Collections: బాక్సాఫీస్ వద్ద 'పొన్నియన్ సెల్వన్' ప్రభంజనం.. సినీ చరిత్రలోనే తొలిసారి..!

Ponniyin Selvan movie 1st Day collections. పొన్నియన్ సెల్వన్ 1 సినిమా భారీ స్థాయిలో ఓపెనింగ్స్‌ రాబట్టింది. ప్రపంచ వ్యాప్తంగా రూ. 130 కోట్ల వరకు థియేట్రికల్‌ బిజినెస్‌ జరిగింది.   

Written by - P Sampath Kumar | Last Updated : Oct 1, 2022, 06:17 PM IST
  • ప్రేక్షకుల ముందుకు పొన్నియన్‌ సెల్వన్‌-1
  • బాక్సాఫీస్ వద్ద 'పొన్నియన్ సెల్వన్' ప్రభంజనం
  • సినీ చరిత్రలోనే తొలిసారి..
Ponniyin Selvan Collections: బాక్సాఫీస్ వద్ద 'పొన్నియన్ సెల్వన్' ప్రభంజనం.. సినీ చరిత్రలోనే తొలిసారి..!

Mani Ratnam, Aishwarya Rais Ponniyin Selvan movie 1st Day collections: లెజండరీ డైరెక్టర్‌ 'మణిరత్నం' దర్శకత్వంలో తెరకెక్కిన ప్రతిష్టాత్మక చిత్రం 'పొన్నియన్‌ సెల్వన్‌-1'. క‌ల్కి కృష్ణమూర్తి రాసిన పొన్నియిన్ సెల్వన్‌ న‌వ‌ల ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది. ఈ సినిమాలో చియాన్ విక్రమ్‌, జయం రవి, కార్తీ.. అందాల తారలు ఐశ్వర్యా రాయ్‌, త్రిష ప్రధాన పాత్రల్లో నటించారు. పీఎస్‌ మొదటి భాగం శుక్రవారం (సెప్టెంబర్‌ 30న) దేశవ్యాప్తంగా విడుదలై మంచి టాక్‌ తెచ్చుకుంది. తమిళనాడులో మాత్రం బాక్సాఫీస్ వద్ద ప్రభంజనం సృష్టిస్తోంది. 

పొన్నియన్ సెల్వన్ 1 సినిమా భారీ స్థాయిలో ఓపెనింగ్స్‌ రాబట్టింది. ప్రపంచ వ్యాప్తంగా రూ. 130 కోట్ల వరకు థియేట్రికల్‌ బిజినెస్‌ జరిగింది. మొదటి రోజు పీఎస్‌-1 చిత్రం రూ. 41.80 కోట్ల వరకు సాధించింది. మొదటి రోజు తమిళంలో రూ. 25.86 కోట్లు గ్రాస్ వసూల్ చేసింది. దాంతో ఈ ఏడాది కోలీవుడ్ బెస్ట్ ఓపెనింగ్స్‌లో మూడో స్థానంలో నిలిచింది. అజిత్ 'వలిమై' సినిమా రూ. 36.17 కోట్లు ఓపెనింగ్స్‌ రాబట్టగా.. విజయ్ 'బీస్ట్' చిత్రం రూ. 26.40 కోట్లు వసూల్ చేసింది. 

తెలుగు రాష్ట్రాల్లో పొన్నియన్ సెల్వన్ 1 సినిమా టాక్‌ ఎలా ఉన్నప్పటికీ.. సాయంత్రం, నైట్‌ షోలకు హౌజ్‌ఫుల్‌ కలెక్షన్స్‌ చేసినట్లు సమాచారం. తెలుగులో దాదాపు రూ. 10 కోట్ల వరకు థియేట్రికల్‌ బిజినెస్‌ జరగగా.. ఫస్ట్‌ డే రూ. 2.88 కోట్లను కలెక్ట్‌ చేసింది. వరల్డ్‌ వైడ్‌గా పీఎస్‌ 1 సినిమా జోరు ఇదే స్థాయిలో దూసుకుపోతే.. త్వరలోనే బ్రేక్‌ ఈవెన్ పూర్తి చేసుకుని లాభాల బాట పట్టనుంది. ఈ వారంలోనే బ్రేక్‌ ఈవెన్ పూర్తిచేయనుంది. 

Also Read: Womens Asia Cup 2022: ఆసియాకప్‌లో భారత్‌ బోణీ.. 41 పరుగుల తేడాతో శ్రీలంకపై విజయం!

Also Read: అంపైర్‌ను కొట్టిన పాకిస్తాన్ బ్యాటర్.. వీడియో చూస్తే నవ్వు ఆపుకోలేరు!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook

 

 

Trending News