Hardik Pandya Re Entry In Test Cricket: టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్, ప్రస్తుత టీ20 కెప్టెన్ హార్దిక్ పాండ్యా టెస్టుల్లో రీఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అవుతున్నాడు. వెన్ను గాయం నుంచి కోలుకున్న తరువాత మైదానంలోకి అడుగుపెట్టిన పాండ్యా.. టీ20, వన్డేలు మాత్రమే ఆడుతున్నాడు. జట్టులో పేస్ ఆల్‌రౌండర్ లేని లోటు స్పష్టంగా కనిపిస్తుండడంతో మళ్లీ అతడిని టెస్టు క్రికెట్‌లోకి తీసుకువచ్చేందుకు బీసీసీఐ ఆలోచిస్తోంది. పాండ్యా ఇప్పుడు పూర్తిగా ఫిట్‌గా ఉన్నాడు. వైట్ బాల్ క్రికెట్‌లో అద్భుతంగా రాణిస్తుండడంతో శివ సుందర్ దాస్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ, బీసీసీఐ ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్‌కు ముందు హార్ధిక్‌తో చర్చించే అవకాశం కనిపిస్తోంది.
ప్రస్తుతం రిషబ్ పంత్, జస్ప్రీత్ బుమ్రా గైర్హాజరీలో భారత జట్టు టెస్ట్ క్రికెట్ ఆడుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో హార్దిక్ పాండ్యా పునరాగమనం టీమిండియాకు లాభదాయకంగా ఉంటుంది. పాండ్యా గాయపడిన సమయంలో శార్దూల్ ఠాకూర్ సీమర్ ఆల్ రౌండర్ పాత్రను పోషించాడు.
బీసీసీఐ సీనియర్ అధికారి మాట్లాడుతూ.. పాండ్యాను టెస్టుల్లోకి తీసుకురావడానికి తొందరపడటం లేదన్నారు. అయితే ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్‌కు ముందు దీని గురించి మాట్లాడతామని తెలిపారు. బుమ్రా లేకపోవడంతో ఇంగ్లండ్‌లో జరిగే టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్లో జట్టులో కీలక పాత్ర పోషించగలడని చెప్పారు. అయితే వెంటనే టెస్టులకు తిరిగి రావాలని పాండ్యాపై ఎలాంటి ఒత్తిడి లేదన్నారు.
'ప్రస్తుతం పాండ్యా టెస్ట్ జట్టులో ఎంపికకు అందుబాటులో లేడు. మీరు అతని గత గాయాల చరిత్రను గుర్తుంచుకోవాలి. అయితే ఎన్‌సీఏ, మెడికల్ టీమ్, హార్దిక్ పాండ్యా స్వయంగా టెస్టుల్లో రీఎంట్రీకి సిద్ధంగా ఉన్నారని భావిస్తే.. అతను కచ్చితంగా ఫీల్డ్‌లో ఉంటాడు..' అని బీసీసీ అధికారి తెలిపారు.
హార్దిక్ 2018లో ఇంగ్లండ్‌తో టీమిండియా తరఫున తన చివరి టెస్టు మ్యాచ్ ఆడాడు. ఇప్పటివరకు మొత్తం 11 టెస్ట్ మ్యాచ్‌లు ఆడాడు. ఇందులో 31.29 సగటుతో 532 పరుగులు చేశాడు. ఇందులో ఒక సెంచరీ, నాలుగు హాఫ్ సెంచరీలు వచ్చాయి. అతని అత్యధిక స్కోరు 108 పరుగులు. బౌలింగ్‌లో 31.06 సగటుతో 17 వికెట్లు తీశాడు. గాయం నుంచి కోలుకుని జట్టులోకి వచ్చిన తరువాత టీ20 జట్టుకు కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. ఆ తరువాత వన్డే జట్టుకు కూడా వైస్ కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు.
Also Read: MLC Kavitha: ప్రెస్‌మీట్ లైవ్‌లోనే ఎమ్మెల్సీ కవితకు షాకిచ్చిన ఢిల్లీ పోలీసులు
Also Read: Minister KTR: మోదీ సర్కార్ చేతిలో ఈడీ కీలు బొమ్మ.. సీబీఐ తోలు బొమ్మ: మంత్రి కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter, Facebook