Jhulan Goswami: చరిత్ర సృష్టించిన ఝులన్ గోస్వామి... ప్రపంచకప్​ చరిత్రలో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా రికార్డు...

Jhulan Goswami: టీమిండియా సీనియర్ బౌలర్ ఝులన్ గోస్వామి చరిత్ర సృష్టించింది. మహిళల క్రికెట్ ప్రపంచకప్‌లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా రికార్డు నెలకొల్పింది.  

Edited by - ZH Telugu Desk | Last Updated : Mar 12, 2022, 10:05 PM IST
Jhulan Goswami: చరిత్ర సృష్టించిన ఝులన్ గోస్వామి... ప్రపంచకప్​ చరిత్రలో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా రికార్డు...

ICC Women's World Cup 2022: టీమిండియా మహిళ ఫాస్ట్ బౌలర్ ఝులన్ గోస్వామి(Jhulan Goswami) అరుదైన ఘనత సాధించింది. ఐసీసీ మహిళల ప్రపంచకప్​లో (ICC Women's World Cup 2022) అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌(Highest wicket-taker in women world cup) గా రికార్డు సృష్టించింది. ఇవాళ వెస్టిండీస్ జరిగిన మ్యాచ్‌లో అనిస్సా మొహమ్మద్‌ వికెట్ తీయడం ద్వారా వుమెన్స్ వరల్డ్ కప్ లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా ఝులన్ గోస్వామి చరిత్ర లిఖించింది. తర్వాతి స్థానాల్లో ఆస్ట్రేలియాకు చెందిన లినెట్​ ఫుల్​స్టోన్​ను (39 వికెట్లు),  మూడోస్థానంలో ఇంగ్లండ్‌కు చెందిన కరోల్ హాడ్జెస్ (37 వికెట్లు) ఉంది. ఇప్పటి వరకు ఐదు ప్రపంచకప్​లు ఆడింది గోస్వామి.

మహిళల క్రికెట్‌లో దిగ్గజ బౌలర్లలో 39 ఏళ్ల ఝులన్ గోస్వామి ఒకరు. వన్డే ఫార్మాట్‌లో 198 మ్యాచ్‌లు ఆడి 249 వికెట్లు పడగొట్టింది. తాజా ప్రపంచకప్​లో కూడా అద్భుతమైన ప్రదర్శన చేస్తోంది. మూడు మ్యాచ్‌ల్లో నాలుగు వికెట్లు కూల్చింది. ఈ ప్రపంచకప్ తనకు చివరిది కావచ్చు. ప్రస్తుతం ఆమె భారత బౌలింగ్‌ విభాగానికి నాయకత్వం వహిస్తుంది. 

ఇవాళ వెస్టిండీస్‌తో జరిగిన మ్యాచ్ లో టీమిండియా (India Women) 155 పరుగుల భారీ తేడాతో ఘన విజయం సాధించింది. బ్యాటింగ్ , బౌలింగ్ లో అద్భుతంగా రాణించిన మిథాలీ సేన..కరీబియన్ జట్టుపై (West Indies Women) అలవోకగా గెలుపొందారు. 318 పరుగుల భారీ లక్ష్యాన్ని చేధించలేక విండీస్ జట్టు కేవలం 162 పరుగులకే చాపచుట్టేసింది. స్మృతి మంధాన, హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ సెంచరీలతో కదం తొక్కగా...స్నేహ్‌రాణా 3 వికెట్లుతో చెలరేగింది.

Also Read: Mithali Raj: చరిత్ర సృష్టించిన మిథాలీ రాజ్.. వరల్డ్‌కప్‌లో అత్యధిక మ్యాచ్‌లకు సారథ్యం వహించిన మహిళగా రికార్డు..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి 

Trending News