విరాట్ కోహ్లీ ఖాతాలో మరో గ్రేట్ రికార్డ్

వరుసగా రికార్డులను తన ఖాతాలో వేసుకుంటున్న విరాట్ కోహ్లీ

Last Updated : Oct 27, 2018, 10:38 PM IST
విరాట్ కోహ్లీ ఖాతాలో మరో గ్రేట్ రికార్డ్

జయాపజయాలతో సంబంధం లేకుండా తనపాటికి తాను సత్తా ఏంటో చాటుకుంటూ పోతున్నాడు టీమిండియా కెప్టేన్ విరాట్ కోహ్లీ. ఈ క్రమంలోనే ఈ పరుగుల మెషిన్ అనేక రికార్డులను తన ఖాతాలో వేసుకుంటూ ఇంకా ముందుకు సాగిపోతున్నాడు. శనివారం పూణే స్టేడియం వేదికగా విండీస్‌తో జరిగిన 3వ వన్డేలో జట్టును గెలిపించేందుకు తీవ్రంగా కృషిచేసిన కోహ్లీ సెంచరీతో చెలరేగిపోయాడు. కోహ్లీ వన్డే కెరీర్‌లో ఇది 38వ సెంచరీ కాగా ఈ వన్డే సిరీస్‌లో మొత్తంగా మూడో సెంచరీ. 

ఇప్పటివరకు ఆడిన మూడు వన్డే మ్యాచ్‌లలో(గౌహతిలో మొదటి వన్డే, వైజాగ్‌లో రెండో వన్డే, నేడు పూణెలో మూడో వన్డే) ఒక్కో సెంచరీ చేసిన కోహ్లీ నేటి సెంచరీతో హ్యాట్రిక్ సెంచరీని నమోదు చేసుకున్నాడు. వన్డే కెరీర్‌లో ఇలా వరుసగా మూడు వన్డే మ్యాచ్‌లలో మూడు సెంచరీలు పూర్తి చేసిన మొట్టమొదటి క్రికెటర్‌గా విరాట్ కోహ్లీ రికార్డుకెక్కాడు. 

Trending News