Virat Kohli said Even I scores 50s and 60s peoples feels I failed: ఇటీవలి కాలంలో చాలాసార్లు 50లు, 60లు కొట్టినా తనను ఫెయిల్ అయినట్లుగానే చూశారని టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ అన్నాడు. అయితే దేవుడి దయతో చాలా మంచి జరిగిందని, అందువల్లే ఇప్పుడు ఈ స్థాయిలో ఉండి మాట్లాడుతున్నాన్నాడు. మంచినీళ్ల ప్రాయంగా సెంచరీలు చేసే కోహ్లీ బ్యాట్ గత మూడేళ్లుగా మూగబోయిన విషయం తెలిసిందే. అడపాదడపా హాఫ్ సెంచరీలు చేసిన కోహ్లీ సెంచరీ చేసి మాత్రం చాలా రోజులైంది. దాంతో అతడిపై ఎన్నో విమర్శలు వచ్చాయి. ఆసియా కప్ 2022లో భాగంగా అఫ్గాన్‌పై శతకం బాదిన కోహ్లీ.. విమర్శకుల నోళ్లు మూయించాడు.
2019 నవంబర్ 23న బంగ్లాదేశ్‌తో జరిగిన డే నైట్ టెస్టులో సెంచరీ బాదిన విరాట్ కోహ్లీ.. 2022 సెప్టెంబర్ 8న ఆఫ్ఘనిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో శతకం నమోదు చేశాడు. కింగ్ కోహ్లీ అఫ్గాన్‌పై 12 ఫోర్లు, 6 సిక్సర్ల సాయంతో 122 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. దాంతో అంతర్జాతీయ క్రికెట్‌లో 71 సెంచరీ నమోదు చేశాడు. విరాట్ సెంచరీ చేయగానే.. మైదానంలోని ఫాన్స్ ఎగిరి గంతులేశారు. వారి ఆనందానికి అవద్దులేకుండా పోయాయి. మ్యాచ్ అనంతరం కోహ్లీ ప్రెస్ కాన్ఫెరెన్స్‌లో మాట్లాడుతూ భావోద్వేగానికి గురయ్యాడు.
'నా క్రికెట్ కెరీర్‌లో ఆశ్చర్యం కలిగించే అంశం ఏంటంటే.. నేను చాలాసార్లు 50లు, 60లు బాదినా విఫలమైనట్లు వ్యాఖ్యలు వచ్చాయి. బాగా ఆడి మంచి భాగస్వామ్యం నిర్మించినప్పటికీ అది కొందరికి సరిపోలేదు. ఏదేమైనా దేవుడి దయతో చాలా మంచి జరిగింది. అందువల్లే ఇప్పుడు ఈ స్థాయిలో ఉండి మీతో మాట్లాడుతున్నా. కష్టపడి పని చేయడమే మన చేతుల్లో ఉంది.. విధి ఎలా ఉంటే అలా జరుగుతుంది' అని విరాట్ కోహ్లీ అన్నాడు.
'నెల రోజుల పాటు విరామం తీసుకోవడం చాలా మంచి చేసింది. విరామ సమయంలో జట్టు మేనేజ్‌మెంట్, సభ్యులు ఎంతో మద్దతుగా నిలిచారు. నాకు కొందరు వ్యక్తుల నుంచి చాలా సలహాలు వచ్చాయి. అక్కడ తప్పు చేశావు.. ఇక్కడ తప్పు చేశావు అని చెప్పి సలహాలు ఇచ్చేవారు. అంన్నింటిని విన్నాను. చివరికి వ్యక్తిగతంగా ఎక్కడ నిలబడ్డాను, నా క్రికెట్ ప్రయాణం ఎలా సాగుతుందనే విషయాలను పరిశీలించాను' అని కింగ్ కోహ్లీ చెప్పుకొచ్చాడు.
Also Read: వాడు టైంకే వస్తాడు.. వచ్చేప్పుడు బ్యాడ్ టైంను కూడా తీసుకొస్తాడు కదా! ఆసక్తికరంగా జిన్నా టీజర్
Also Read: విరాట్ కోహ్లీ ఓపెనర్‌గా వస్తే... నేను ఖాళీగా కూర్చోవాలా! కేఎల్ రాహుల్ ఫైర్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook