సరిహద్దులో ఉగ్రవాదులు మరోసారి కాల్పులకు తెగబడ్డారు. అప్రమత్తమైన భద్రతా బలగాలు జరిపిన కాల్పుల్లో ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారు. శ్రీనగర్ ఎన్కౌంటర్ ఘటన (Srinagar Encounter)లో ఓ పోలీసు సైతం అమరుడయ్యారు.
జమ్మూకాశ్మీర్ (Jammu Kashmir) లో మళ్లీ కర్ఫ్యూను విధించారు. ఆగస్టు 5తో జమ్మూ కాశ్మీర్‌కు ప్రత్యేక రాష్ట్ర హోదాను ఇచ్చే రాజ్యాంగంలోని ఆర్టికల్ 370 (article 370), ఆర్టికల్ 35ఏ ను రద్దు చేసి ఏడాది పూర్తికానుంది.
సంజ్వాన్, శ్రీనగర్‌లో భారత భద్రతా దళాలకు, తీవ్రవాదులకు మధ్య ఎదురుకాల్పులు కొనసాగుతున్న వేళ.. జమ్మూకాశ్మీర్‌లోని మరో ఉగ్రదాడి కదలికలను భారత భద్రతాదళాలు గుర్తించాయి.
జమ్మూకాశ్మీర్ లో మరోసారి ఉగ్రవాదులు చెలరేగిపోయారు. కట్టుదిట్టమైన శ్రీనగర్ విమానాశ్రయం సమీపంలో ఉన్న బిఎస్ఎఫ్ క్యాంపుపై పాకిస్థాన్ ఉగ్రవాద సంస్థ జైషే మొహమ్మద్ దాడులకు తెగబడింది. అయితే భద్రతా సిబ్బంది ఉగ్రవాదుల చర్యలను తిప్పికొట్టింది. కానీ ఉగ్రవాదులతో జరిగిన ఎదురుకాల్పుల్లో ఒక ఏఎస్ఐ మృతి చెందగా, మరో ముగ్గురు జవాన్లకు గాయాలయ్యాయి. వీరిని సమీప ఆసుపత్రికి తరలించినట్లు అధికారులు వెల్లడించారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.