జమ్మూకాశ్మీర్‌లో సంజ్వాన్ ఉగ్రదాడి మరువక ముందే.. పాకిస్తాన్ ఉగ్రవాదులు మరోమారు రెచ్చిపోయారు. సోమవారం ఉదయం 4:30 గంటల సమయంలో శ్రీనగర్‌లో సీఆర్పీఎఫ్ క్యాంప్ వద్ద ఇద్దరు ఉగ్రవాదులు కాల్పులకు తెగబడ్డారు. వారి వద్ద బ్యాగులు, ఏకే 47 తుపాకీలు ఉన్నాయి. ఉగ్రవాదుల దాడులను జవాన్లు సమర్ధంగా తిప్పికొడుతున్నారు. ఉగ్రవాదులకు, జవాన్లకు మధ్య కాల్పులు కొనసాగుతున్నాయి.
#FLASH: 2 terrorists, carrying bags & armed with AK47s, were seen approaching towards CRPF camp in Srinagar, sentries opened fire after which terrorists fled from the spot. Search of camp periphery underway. pic.twitter.com/77uNZkiKat
— ANI (@ANI) February 12, 2018
కాగా, సంజ్వన్ ఆర్మీ స్థావరం వద్ద జరిగిన ఉగ్రదాడిలో ఐదుగురు భద్రతా సిబ్బంది, ఒక పౌరుడు మృతి చెందారు. ఈ ఘటనలో ఆరుగురు ఆర్మీ సిబ్బందికి, ఆరుగురు పౌరులకు గాయాలయ్యాయి. జవాన్లు నలుగురు ఉగ్రవాదులను మట్టుబెట్టారు. ప్రస్తుతం ఆర్మీ క్యాంప్ వద్ద కూంబింగ్ ఆపరేషన్ ఇంకా కొనసాగుతోంది.
Jammu & Kashmir: Encounter underway at CRPF camp in Srinagar's Karan Nagar. 23 Bn CRPF engaged in firing; Visuals deferred by unspecified time pic.twitter.com/mHFf3UNHyf
— ANI (@ANI) February 12, 2018