హిమాచల్ ప్రదేశ్ సీఎం అభ్యర్ధి విషయంలో బీజేపీ క్లారిటీ ఇచ్చింది. ముఖ్యమంత్రి అభ్యర్ధిగా ప్రేమ్ కుమార్ ధుమాల్ పేరును ఖరారు చేసింది. మంగళవారం ఎన్నికల ప్రచారంలో భాగంగా కాంగ్రాలో నిర్వహించిన బహిరంగ సభలో పాల్గొన్న బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా.. ఈ మేరకు ప్రకటన చేశారు. ప్రేమ్ కుమార్ ధుమాల్ నాయకత్వంలో తమ పార్టీ ఎన్నికల బరిలోకి దిగనుందని ప్రకటించారు.
రెండు స్లారు సీఎం పీఠమెక్కిన ధుమాల్..
హిమాచల్ ప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల షెడ్యుల్ విడుదలైంది. నవంబర్ 9న ఎన్నికలు నిర్వహిస్తున్నట్లు ఈసి ప్రకటించింది. ఎన్నికలను ఒకే విడతలో నిర్వహిస్తన్నట్లు వెల్లడించింది. కాగా డిసెంబర్ 18న ఎన్నికల కౌంటింగ్ నిర్వహిస్తున్నట్లు ప్రకటన వెలువడింది. షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో ఎన్నికల కోడ్ తక్షణమే అమల్లోకి వచ్చినట్లు సీఈసీ ఏకే జ్యోతి పేర్కొన్నారు. ఒక్కో అభ్యర్ధి ఎన్నికల ఖర్చు రూ.25 లక్షల మించకుండా.. పరిమితులు విధిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈవీఎంలకు వీవీ ప్యాడ్ ల వినియోగిస్తున్న ట్లు ఈ సందర్భంగా సీఈసీ ఏకే జ్యోతి వెల్లడించారు
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.