LRS In Telangana: వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్ల విషయంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఎల్ఆర్ఎస్ అంశంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో టీఆర్ఎస్ సర్కార్ దీనిపై వెనక్కి తగ్గింది.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నూతన రెవెన్యూ విధానంతోపాటు భూముల క్రమబద్ధీకరణ పథకాన్ని (LRS) సైతం అమల్లోకి తీసుకొచ్చింది. దీనిద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అనధికారిక లే అవుట్లు, ప్లాట్ల క్రమబద్ధీకరణ చేసుకునేందుకు వీలు కల్పిస్తూ.. తెలంగాణ ప్రభుత్వం ఆగస్తు 31న ఈ పథకాన్ని ప్రారంభించింది.
LRS Deadline Telangana | తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నూతన రెవెన్యూ విధానం అమలులోకి వచ్చాక భూముల క్రమబద్ధీకరణ పథకం (LRS) స్కీమ్ తీసుకొచ్చింది. అయితే ఎల్ఆర్ఎస్ తుది గడువు (LRS last date In Telangana) నేటి (అక్టోబర్ 15)తో ముగియనుంది.
తెలంగాణ మున్సిపల్, ఐటీశాఖల మంత్రి కేటీఆర్ (Telangana Minister KTR) కీలక నిర్ణయం తీసుకున్నారు. ప్లాట్ల క్రమబద్ధీకరణ పథకం (LRS) 2015 కింద గతంలో దరఖాస్తు చేసుకున్నవారు తాజాగా మరోసారి దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం ((Applications under LRS 2015 to be disposed)) లేదన్నారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.