సరిగ్గా 21 సంవత్సరాల క్రితం కమల్ హాసన్ హీరోగా నటించిన "భారతీయుడు" సినియా ఎంతటి ఘన విజయం సొంతం చేసుకుందో అందరికీ తెలిసిందే. విశేష ప్రేక్షక ఆదరణ పొందిన ఈ చిత్రానికి సీక్వెల్ వస్తోంది. సీక్వెల్ గా వస్తున్న 'భారతీయుడు2 (ఇండియన్2)' సినిమాకు మరోసారి శంకర్ డైరక్టర్ గా వ్యవహరిస్తున్నారు. కాగా ఈ సినిమాను నిర్మించేందుకు దిల్ రాజు ముందుకు వచ్చారు. ఈ సినిమాలో డైరెక్టర్ శంకర్ తో కలిసి పనిచేస్తున్నందుకు సంతోషంగా ఉందని హీరో కమల్ హాసన్ తన అభిప్రాయాన్ని వెల్లడించారు .
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.