బీజేపీ చీఫ్ అమిత్ షా కు శివసేన పార్టీ ఊహించని విధంగా ఝలక్ ఇచ్చింది. ఎన్నికల కోసం మిత్రులను కూడగట్టే కార్రక్రమంలో భాగంగా అమిత్ షా ఈ రోజు సాయంత్రం శివసేన అధ్యక్షుడు ఉద్దేవ్ థాక్రేతో భేటీ కావాల్సి ఉంది. ఠాక్రేను ఏదో రకంగా బుజ్జగించి కలుపుకుపోవాలనే లక్ష్యంతో భేటీకి సిద్ధమౌతున్న తరుణంలో 2019 ఎన్నికల ముందు బీజేపీతో ఎటువంటి పొత్తు ఉండబోదని శివసేన సంకేతాలు ఇచ్చింది. ఈ విషయాన్ని సామ్నా సంపాదకీయం రూపంలో ప్రకటించింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.