EPFO interest rates in FY 2020-21 : న్యూఢిల్లీ: కరోనావైరస్ కారణంగా లాక్డౌన్ విధించడంతో ఆర్థిక సంక్షోభంలో పడిన చాలా మంది ఆర్థిక వెసులుబాటు కోసం తమ EPFO account లో దాచుకున్న డబ్బులను విత్డ్రా చేసుకోవడం మొదలుపెట్టారు. అంతేకాకుండా పీఎఫ్ ఖాతాదారుల వెసులుబాటు కోసం వారి నుంచి ఇపిఎఫ్ఓ తక్కువ మొత్తంలో EPF Money కట్ చేయడంతో 2020-21 ఆర్థిక సంవత్సరంలో EPFO ఖాతాల్లో డిపాజిట్ అయ్యే మొత్తం కూడా అంతేస్థాయిలో తగ్గిపోయింది.
కరోనా కారణంగా (Coronavirus) ఎదురయ్యే ఆర్థిక ఇబ్బందులను (Financial crisis) అధిగమించేందుకు కేంద్రం సైతం ఎంప్లాయిస్ ప్రావిడెంట్ ఫండ్ డబ్బులను విత్డ్రా (Withdraw EPF money) చేసుకోవడం సులభతరం చేసింది. ఈమేరకు గత వారమే కేంద్ర కార్మిక శాఖ ఓ నోటిఫికేషన్ను సైతం విడుదల చేసింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.