Etela Rajender press meet live updates: హుజూరాబాద్ నుంచి బీజేపీ ఎమ్మెల్యేగా గెలిచిన బీజేపి ఎమ్మెల్యే ఈటల రాజేందర్ మరో సంచలన ప్రకటన చేశారు. బీజేపి అధిష్టానం ఆదేశిస్తే తాను తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రేశేఖర్ రావుపై పోటీ చేయడానికైనా సిద్ధమేనని ఈటల రాజేందర్ ప్రకటించారు.
Huzurabad by-poll result live updates: ఇప్పటివరకు టీఆర్ఎస్ పార్టీ తరపున ఆరుసార్లు ఎమ్మెల్యేగా పోటీ చేసిన ఈటల రాజేందర్.. ప్రతీ ఎన్నికలోనూ విజయం సాధిస్తూ వచ్చారు. ఈ నేపథ్యంలో ఇప్పటివరకు ఈటల రాజేందర్ పోటీ చేసిన ఎన్నికల వివరాలు, ఆయా ఎన్నికల్లో ఆయన తన సమీప ప్రత్యర్థిపై సాధించిన మెజార్టీ వివరాలను ఓసారి పరిశీలిద్దాం.
Huzurabad exit poll results declared: హుజూరాబాద్ నియోజవర్గం (Huzurabad constituency) పరిధిలో మొత్తం 306 పోలింగ్ స్టేషన్లలో ఓటింగ్ ప్రక్రియ కొనసాగింది. ఈ ఉప ఎన్నికపై 'పీపుల్స్ పల్స్' అనే సంస్థ వెల్లడించిన ఎగ్జిట్ పోల్ ఫలితాల్లో ఓటర్లు బీజేపీ వైపే ఉన్నట్టు కనిపించింది.
గుడిసెల్లో ఉండేవారికి, ప్లాస్టిక్ కవర్లనే నివాసంగా ఏర్పాటు చేసుకుని ఉంటున్న వారికే ముందుగా డబుల్ బెడ్ రూం ఇళ్లు మంజూరు చేస్తామని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ తెలిపారు. 500 డబుల్ బెడ్ రూం ఇళ్లు పంపిణీ కోసం సిద్ధమవుతున్నాయని మంత్రి చెప్పారు.
మంత్రి పదవి మీరు పెట్టిన భిక్ష. మీరే హక్కుదారులు. నా కారులో మీరు పెట్రోలు పోస్తే నేను తిరుగుతున్నాను అనే విషయాన్ని ప్రతీక్షణం గుర్తుపెట్టుకొని పనిచేస్తున్నానని మంత్రి ఈటల వ్యాఖ్యానించారు. హుజురాబాద్లో "పట్టణ ప్రగతి" కార్యక్రమాన్ని ప్రారంభించిన సందర్భంగా మంత్రి ఈటల ఈ వ్యాఖ్యలు చేశారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.