Beautiful Dams To Visit In Monsoon Season: వర్షాకాలంలో ఎలాంటి పర్యాటక ప్రదేశాలకు వెళ్తే బాగుంటుంది అని ఆలోచిస్తున్నారా ? అయితే, ఈ డీటేల్స్ మీకోసమే. వర్షాకాలంలో నిండుకుండలా కనిపించే రిజర్వాయర్లు, వాటి చుట్టూ పచ్చటి తివాచి పరిచినట్టుగా కనిపించే అడవులు, కొండకోనల ప్రకృతి అందాలు వీక్షకులను చాలా ఆకట్టుకుంటుంటాయి.
కేరళలో కురుస్తున్న భారీ వర్షాలు అక్కడి జనజీవనాన్ని పూర్తిగా అస్తవ్యస్తం చేస్తున్నాయి. ఇప్పటికే అనేక లోతట్టు ప్రాంతాలు పూర్తి జలమయం కాగా రహదారులు దెబ్బతినడంతో గ్రామాలకు గ్రామాలకు మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. భారీ వర్షాల కారణంగా మృతిచెందిన వారి సంఖ్య 27కి చేరినట్టు అధికారిక వర్గాలు ప్రకటించాయి. రాష్ట్ర ముఖ్యమంత్రి పినరాయి విజయన్ తన కార్యక్రమాలన్నీ వాయిదా వేసుకుని తిరువనంతపురం కేంద్రంగా అన్ని జిల్లాల అధికారులతో ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నారు. కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ముఖ్యమంత్రి పినరాయి విజయన్‌తో ఫోన్లో మాట్లాడి అక్కడి పరిస్థితి గురించి అడిగి తెలుసుకున్నారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.