Beautiful Dams To Visit In Monsoon Season: వర్షాకాలంలో ఎలాంటి పర్యాటక ప్రదేశాలకు వెళ్తే బాగుంటుంది అని ఆలోచిస్తున్నారా ? అయితే, ఈ డీటేల్స్ మీకోసమే. వర్షాకాలంలో నిండుకుండలా కనిపించే రిజర్వాయర్లు, వాటి చుట్టూ పచ్చటి తివాచి పరిచినట్టుగా కనిపించే అడవులు, కొండకోనల ప్రకృతి అందాలు వీక్షకులను చాలా ఆకట్టుకుంటుంటాయి. అందుకే దేశంలో ఆకట్టుకునేలా ఉన్న కొన్ని అందమైన ప్రదేశాలతో కూడిన రిజర్వాయర్ల వివరాలను బ్రీఫ్‌గా మీ కోసం అందిస్తున్నాం. ఈ వానాకాలం వీలైతే చుట్టొచ్చే ప్రదేశాల్లో వీటిని కూడా చేర్చుకోవచ్చు.
శ్రీశైలం డ్యామ్... శ్రీశైలం కొండల మధ్య నిర్మించిన ఈ డ్యామ్ కేవలం రిజర్వాయర్ పరంగానే కాకుండా.. ఆధ్యాత్మికంగానూ ప్రముఖ పుణ్యక్షేత్రంగా విరాజిల్లుతోంది. అష్టాదశ జ్యోతిర్లింగాలలో ఒకటైన మల్లిఖార్జున జ్యోతిర్లింగ మందిరం ఇక్కడే ఉంది అని ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఇక్కడి ప్రకృతి కడు రమణీయంగా కనిపిస్తుంటుంది. హైదరాబాద్ నుండి 215 కిమీ దూరంలో ఉన్న శ్రీశైలం ప్రతీ ఒక్కరూ చూసి తీరాల్సిన ప్రదేశాల్లో ఒకటి.
నాగార్జున సాగర్.. కృష్ణానదిపై నాగార్జున కొండ వద్ద నిర్మించిన అద్భుతమైన ఆనకట్టే ఈ నాగార్జున సాగర్. 1955 నుండి 1967 వరకు 12 ఏళ్ల పాటు ఈ డ్యామ్ నిర్మాణం జరిగింది. హైదరాబాద్ నుండి 160 కిమీ దూరం ఉన్న ఈ ప్రాజెక్ట్ నగరవాసులకు మంచి పిక్నిక్ స్పాట్. మరీ ముఖ్యంగా వర్షాలు కురిసి కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతూ వెళ్లి నాగార్జునసాగర్ గేట్ల నుండి కిందకు దూకే దృశ్యం అద్భుతంగా ఉంటుంది. ఇక్కడ నాగార్దున కొండపైకి లాంచిలో వెళ్లడం కూడా ఒక గొప్ప అనుభూతి.
ఇడుక్కి డ్యామ్ .. అనేది పెరియార్ నదిపై నిర్మించిన డబుల్ కర్వేచర్ ఆర్చ్ డ్యామ్ ఇది. కేరళలోని ఇడుక్కిలో కురవన్, కురాతి అనే రెండు గ్రానైట్ కొండల మధ్య ఇరుకైన లోయలో ఈ డ్యామ్ నిర్మించారు. 554.2 అడుగుల ఎత్తుతో నిర్మించిన ఈ డ్యామ్.. ఆసియాలోనే ఎత్తైన ఆర్చ్ డ్యామ్‌లలో ఒకటిగా పేరొందింది. ప్రకృతి అందాలు కప్పుకున్నట్టుగా ఉండే ఈ రిజర్వాయర్ మంచి టూరిజం ప్లేస్ కూడా. ఇడుక్కికి వెళ్తుంటే కనిపించే కాఫీ తోటలు, హిల్ స్టేషన్స్ అందాలు చూసి తీరాల్సిందే.
బాణాసుర సాగర్ డ్యామ్.. 1979లో ప్రారంభించిన ఈ ఆనకట్ట, ఒక కాలువ బాణాసురసాగర్ ప్రాజెక్ట్‌లో ఒక భాగం. కక్కాయం హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ ప్రాజెక్ట్‌కి అవసరమైన నీటి వనరులను సమకూర్చడంతో సాగు నీటి అవసరాలను తీర్చడం కోసం ఈ ప్రాజెక్టుని నిర్మించారు. ఈ డ్యామ్ ఎత్తు 38.5 మీటర్లు. అంటే 126 అడుగులు ఎత్తు కాగా 685 మీటర్లు పొడవులో విస్తరించి ఉంది.
భాక్రా నంగల్ డ్యామ్.. హిమాచల్ ప్రదేశ్‌లోని బిలాస్‌పూర్ జిల్లాలో బిలాస్‌పూర్‌కి అతి సమీపంలో ఉన్న భాక్రా అనే గ్రామంలో సట్లజ్ నదిపై నిర్మించిన డ్యామ్ ఇది. నీటి సామర్థ్యం పరంగా ఇది దేశంలోనే అతి పెద్ద మూడో ప్రాజెక్ట్. మొదటిది మధ్యప్రదేశ్ లోని ఇందిరాసాగర్ ప్రాజెక్ట్ కాగా రెండోది మన నాగార్జున సాగర్ డ్యామ్ కావడం విశేషం.
హిరాకుడ్ డ్యామ్.. ఒడిషాలోని సంబల్పూర్ నుండి 15 కిలోమీటర్ల దూరంలో మహానది నదిపై నిర్మించిన ప్రాజెక్ట్ ఇది. ప్రపంచంలోనే అతి పొడవైన మట్టి ఆనకట్టగా ఈ ప్రాజెక్టుకి పేరుంది. ఈ డ్యామ్ కి గొప్ప చరిత్ర కూడా ఉంది. 1946 మార్చి 15న అప్పటి ఒడిషా గవర్నర్ సర్ హాథోర్న్ లూయిస్ హిరాకుడ్ డ్యామ్ నిర్మాణానికి శంకుస్థాపన చేయగా.. 1947 జూన్ నెలలో ప్రభుత్వానికి ఈ ప్రాజెక్ట్ గురించి ఒక డీటేల్డ్ రిపోర్ట్ ఇచ్చింది. 1948 ఏప్రిల్ 12న పండిట్ జవహర్‌లాల్ నెహ్రూ చేతుల మీదుగా కాంక్రీట్ వర్క్ ప్రారంభమైంది.
ఇది కూడా చదవండి : Cats & Hen Viral Video: కోడి పిల్లలను పెంచుకుంటున్న పిల్లి.. ఆ సీన్ చూసి షాకైన తల్లి కోడి
ఇందిరా సాగర్ డ్యామ్.. ఈ రిజర్వాయర్‌లో నిల్వ సామర్థ్యం పరంగా చూస్తే మన దేశంలో ఇదే అతిపెద్ద డ్యామ్. మధ్యప్రదేశ్‌లోని ఖాండ్వా జిల్లాలో నర్మదా నగర్ వద్ద నర్మదా నదిపై ఈ రిజర్వాయర్ నిర్మించారు. 1984లో అక్టోబర్ 23న అప్పటి భారత ప్రధాని ఇందిరా గాంధీ చేత ఈ ప్రాజెక్టుకు పునాది రాయి పడింది. ఈ డ్యామ్ నిర్మించే క్రమంలో 22,000 మంది జనాభా ఉన్న ఒక పట్టణం, 100 గ్రామాలు ఖాళీ చేయించారు.
ఇది కూడా చదవండి : Snake In Cauliflower: కాలీఫ్లవర్‌లో పాము.. ఒళ్లు జలదరించే షాకింగ్ వీడియో
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి