Himanshu Rao Surprise To Former CM KCR: బీఆర్ఎస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ఆయన మనవడు సర్ప్రైజ్ ఇచ్చాడు. విదేశాల్లో చదువుకుంటున్న మాజీ మంత్రి కేటీఆర్ కుమారుడు హిమాన్ష్ రావు అకస్మాత్తుగా స్వదేశం వచ్చాడు. అంతేకాకుండా లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్న కేసీఆర్‌కు తెలియకుండా ఆయన బస్సులోకి వెళ్లాడు. బస్సు యాత్రలో కేసీఆర్ బిజీగా ఉన్న సమయంలో హిమాన్షు వెళ్లి కలిశాడు. దీనికి సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది.
KCR Bus Yatra Theft Gold Chain And Cash: లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా విస్తృత ప్రచారం చేస్తున్న బీఆర్ఎస్ పార్టీ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ పర్యటనలో జేబుదొంగలు రెచ్చిపోతున్నారు. పెద్ద ఎత్తున ప్రజలు తరలివస్తుండడంతో జేబుదొంగలు చేతివాటం చూయిస్తున్నారు. కేసీఆర్ పఠాన్‌చెరు పర్యటనలో బంగారు గొలుసు, నగదు మాయమైంది. పోలీసులు సక్రమంగా బందోబస్తు నిర్వహించడం లేదని కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
KCR Touches His Intermediate Teacher Foot In Election Campaign: ఎన్నికల ప్రచారంలో మాజీ సీఎం కేసీఆర్ భావోద్వేగానికి లోనయ్యారు. తనకు పాఠాలు బోధించిన గురువును చూసి ఒకింత ఉద్వేగానికి లోనయి పాదాభివందనం చేశారు.
Ramakka Song: అసెంబ్లీ ఎన్నికల్లో ఒక ఊపు ఊపిన రామక్క పాట ప్రస్తుతం లోక్‌సభ ఎన్నికల్లో కనిపించడం లేదు. రామక్క పాటకు విశేష ఆదరణ లభించినా ఎన్నికల్లో అంతగా ప్రభావం చూపకోవడంతో బీఆర్ఎస్ పార్టీ తాజా ఎన్నికల్లో ఆ పాటను వినియోగించడం లేదు. పాటతో అధికారం రాకపోవడంతో ఆ పాటను వదిలేసి ఇతర పాటలు గులాబీ పార్టీ వాడుతోంది.
Former CM KCR: మాజీ సీఎం కేసీఆర్ తన బస్సు యాత్రలో భాగంగా తొర్రురు రోడ్డుమీద కాసేపు ఆగారు. అక్కడ మిర్చీ దుకాణంలో వెళ్లి సరదగా అక్కడివారిని పలకరించారు. అంతేకాకుండా అక్కడి చిన్న పిల్లలకు మిర్చీ బజ్జీలను కూడా తన చేతితో ఇచ్చారు.
My Age Is Our Telangana Future Is Youth Says KCR: ఎన్నికల ప్రచారంలో బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ భావోద్వేగానికి లోనయ్యారు. తన వయసైపోతుందని పేర్కొంటూనే తెచ్చిన తెలంగాణ యువకులేదనని చెప్పారు.
KCR Bus Yatra: లోక్‌సభ ఎన్నికలకు బీఆర్ఎస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు సిద్ధమయ్యారు. 'పొలంబాట'తో రైతుల పరామర్శకు వెళ్లగా ప్రజల నుంచి అనూహ్య స్పందన లభించింది. ఇదే ఉత్సాహంతో లోక్‌సభ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం చేసేందుకు కేసీఆర్ బస్సు యాత్రకు సిద్ధమయ్యారు. బస్సు యాత్రను విజయవంతం చేసేందుకు గులాబీ దండు సిద్ధమైంది. కొన్ని రోజుల్లో ఈ యాత్రకు సంబంధించి అధికారిక షెడ్యూల్ విడుదల కానుంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.