CM Chandrababu Nemakallu Tour Schedule For NTR Bharosa Scheme: అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం పింఛన్ల పంపిణీని మరోసారి చేపట్టనుంది. నెల ప్రారంభానికి ముందే పింఛన్లు ఇచ్చేందుకు సిద్ధమైంది. పింఛన్ల పంపిణీలో సీఎం చంద్రబాబు స్వయంగా పాల్గొననున్నారు.
AP Assembly Deputy Speaker: ఆంధ్ర ప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం కొలువుదీరిన తర్వాత నాలుగు నెలల తర్వాత పూర్తి స్థాయి బడ్జెట్ ను ప్రవేశ పెట్టారు. ముఖ్యంగా సంక్షేమం, అభివృద్ది సమతూకం పాటిస్తూ బడ్జెట్ రూపకల్పన చేసారు. మరోవైపు అసెంబ్లీలో కీలకమైన ఛీఫ్ విప్ పోస్ట్ లను భర్తీ చేసిన కూటమి ప్రభుత్వం స్పీకర్ తర్వాత కీలకమైన డిప్యూటీ స్పీకర్ పదవిని మాత్రం ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణంరాజును ఎంపిక చేసినట్టు తెలుస్తోంది.
YS Sharmila Comments On AP Budet: కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌ను కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తప్పుబట్టారు. స్పష్టత లేని బడ్జెట్‌గా వర్ణించారు.. మరో మేనిఫెస్టోలా ఉందని విమర్శించారు.
AP Deputy Speaker: ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం కొలువు తీరిన తర్వాత కొన్ని కీలక పదవుల భర్తీ పూర్తి కాలేదు. అందులో ముఖ్యమైన డిప్యూటీ స్పీకర్ పదవిలో ఇంకా ఎవరినీ నియమించలేదు. ఇప్పటికే స్పీకర్ గా చింతకాయల అయ్యన్నపాత్రుడు ఉన్నారు. దీంతో ఈ పదవి టీడీపీకి దక్కుతుందా.. ? కూటమిలోని నేతలకు దక్కుతుందనే దానిపై ఊహాగానాలు మొదలయ్యాయి.
AP Assembly Budget Sessions: 2024 ఏపీలో ఎన్నికల తర్వాత బడ్జెట్ సమావేశాలు మరికాసేట్లో ప్రారంభం కానున్నాయి. ఈ సారి బడ్జెట్ లో ఎక్కువ సంక్షేమ పథకాలతో పాటు అభివృద్దికి నిధులు కేటాయించబోతున్నట్టు సమాచారం. ఎన్నికల ముందు గత ప్రభుత్వం ప్రవేశ పెట్టిన ఓటాన్ అకౌంట్ బడ్జెట్ తర్వాత.. ఇపుడు 2024-25 యేడాదికి కాను పూర్తి స్థాయి బడ్జెట్ ను ప్రవేశ పెట్టనున్నారు.
AP Budget Sesssion 2024-25 : ఎల్లుండి ఆంధ్ర ప్రదేశ్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ సారి కొన్ని అభవృద్ది సంక్షేమ పథకాలే ఎక్కువ కేటాయింపులు చేపట్టనున్నట్టు తెలుస్తుంది. ఎన్నికల యేడాది కాబట్టి అప్పటి జగన్ ప్రభుత్వం శాసనసభలో ఓటాన్ బడ్జెట్ అకౌంట్ ప్రవేశపెట్టింది. కానీ ఎన్నికల తర్వాత కొలువైన చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం ఇప్పటి వరకు 2024-25 పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టలేదు. ఇపుడు ఆలస్యంగా ఈ నెల 11న బడ్జెట్ సమావేశాల్లోనే ఏపీ బడ్జెట్ ను ప్రవేశ పెట్టనున్నారు.
YS Jagan Mohan Reddy Will Be Attend AP Assembly Budget Session: అధికారం కోల్పోయిన తర్వాత జరుగుతున్న తొలి బడ్జెట్ సమావేశాలకు మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి హాజరవుతారా? లేదా? అనేది ఉత్కంఠ నెలకొంది.
గత నవంబర్‌లో సెకీ పిలిచిన టెండర్లలో గుజరాత్ రాష్ట్రం ఒక యూనిట్ సౌర విద్యుత్‌ను రూ.1.99కే కొనుగోలు చేసిందని పయ్యావుల కేశవ్ గుర్తుచేశారు.ఏపీ ప్రభుత్వం మాత్రం ఒక యూనిట్‌కు రూ.2.49 వెచ్చించి సెకీ నుంచి విద్యుత్ కొనుగోలు చేసిందన్నారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.