AP Deputy Speaker: కూటమి ప్రభుత్వంలో అత్యంత కీలకమైన పదవి ఎవరికీ దక్కబోతుంది..

AP Deputy Speaker: ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం కొలువు తీరిన తర్వాత  కొన్ని కీలక పదవుల భర్తీ పూర్తి కాలేదు. అందులో ముఖ్యమైన డిప్యూటీ స్పీకర్ పదవిలో ఇంకా ఎవరినీ నియమించలేదు. ఇప్పటికే స్పీకర్ గా చింతకాయల అయ్యన్నపాత్రుడు ఉన్నారు. దీంతో ఈ పదవి టీడీపీకి దక్కుతుందా.. ? కూటమిలోని నేతలకు దక్కుతుందనే దానిపై ఊహాగానాలు మొదలయ్యాయి.

Written by - TA Kiran Kumar | Last Updated : Nov 12, 2024, 08:02 AM IST
AP Deputy Speaker: కూటమి ప్రభుత్వంలో అత్యంత  కీలకమైన  పదవి ఎవరికీ దక్కబోతుంది..

AP Deputy Speaker: ఆంధ్ర ప్రదేశ్ లో ప్రస్తుతం బడ్జెట్ సమావేశాలు జరగుతున్నాయి. నిన్న ఆర్ధిక మంత్రి పయ్యావుల కేశవ్.. అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశ పెట్టారు.  ఈ నేపథ్యంలో అసెంబ్లీలో కీలక పదవులు ఎవరికి దక్కుతాయన్న విషయంపై చర్చ సాగుతోంది. డిప్యూటీ స్పీకర్‌ పదవి ఎవరిని వరిస్తుందన్న దానిపై ఆసక్తి నెలకొంది. తాజాగా కాలవ శ్రీనివాసులు పేరు పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తోంది. అలాగే సభలో చీఫ్‌విప్‌ పదవికి బెందాళం అశోక్ తో పాటు  కూన రవికుమార్‌ పేర్లు ప్రతిపాదనలో ఉన్నట్లు తెలుస్తోంది.

Add Zee News as a Preferred Source

శాసనసభలో విప్‌లుగా జనసేన పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు బొమ్మిడి నాయకర్, అరవ శ్రీధర్‌ పేర్లను ఆ పార్టీ అధిష్ఠానం  ఖరారు చేసింది. జనసేన పార్టీ నుంచి మూడో విప్‌గా బొలిశెట్టి శ్రీనివాస్‌ పేరు పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. శాసనమండలిలో చీఫ్‌విప్‌గా టీడీపీ ఎమ్మెల్సీలు పంచుమర్తి అనురాధ, భూమిరెడ్డి రామ్‌గోపాల్‌రెడ్డి పేర్లను ఖరారు చేసినట్టు తెలుస్తోంది. ఈ ఇద్దరు ఎమ్మెల్సీలలో ఒకరు చీఫ్‌ విప్‌ అయితే మరొకరిని విప్‌గా నియమిస్తారని సమాచారం.

మరో ఇద్దరు సభ్యులకు విప్‌గా అవకాశం ఇవ్వబోతున్నట్లు సమాచారం. ఆ రెండింటిలో ఒకటి జనసేన పార్టీకి ఇచ్చే అవకాశం ఉందనే చర్చ జరుగుతోంది. ఆ పార్టీ నుంచి హరిప్రసాద్ ఎమ్మెల్సీగా ఉండటంతో ఆయనను వరించే అవకాశం వుంది. ఈ  అసెంబ్లీ సమావేశాల్లో వాటిని భర్తీ చేయనున్నారని తెలుస్తోంది.అయితే బీజేపీ మాత్రం పార్టీ విప్ పదవులు ఎవరికీ కట్టబెట్టాలన్న దానిపై ఇంకా ఓ నిర్ణయం తీసుకోలేదు. త్వరలో కేంద్ర అధిష్ఠానం దీన్ని భర్తీ పై ఓ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.

ఇదీ చదవండి : Balayya Heroine: ఎఫైర్స్ తో టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా నిలిచిన బాలయ్య భామ.. మైండ్ బ్లాంక్ చేస్తోన్న హీరోయిన్ ఫ్లాష్ బ్యాక్..

ఇదీ చదవండి : Shraddha Kapoor: చిరంజీవికి శ్రద్ధా కపూర్ కు ఉన్న రిలేషన్ తెలుసా.. ఫ్యూజులు ఎగిరిపోవడం పక్కా..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

About the Author

TA Kiran Kumar

కిరణ్ కుమార్ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్‌లో ఛీఫ్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి  వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. సినిమా రివ్యూలు, సినిమాలకు సంబంధించి ప్రత్యేక కథనాలు కూడా రాస్తుంటారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో 18 ఏళ్లకుపైగా అనుభవం ఉంది.

...Read More

Trending News