Vivo New Mobile 2024: వివో నుంచి చౌకగా 252GB స్టోరేజ్‌తో కొత్త మొబైల్ లాంచ్.. ఫీచర్స్, స్పెసిఫికేషన్స్ తెలుసుకోండి!

Vivo New Mobile 2024: ప్రముఖ స్మార్ట్ ఫోన్ కంపెనీ వివో మార్కెట్లోకి కొత్త మొబైల్‌ను విడుదల చేసింది. ఇది అతి తక్కువ ధరలోనే ప్రీమియం ఫీచర్స్‌తో అందుబాటులోకి వచ్చింది. అయితే ఈ స్మార్ట్ ఫోన్‌కి సంబంధించిన ఫీచర్స్ ఏంటో, ధర పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

Written by - Dharmaraju Dhurishetty | Last Updated : Apr 21, 2024, 01:16 PM IST
Vivo New Mobile 2024: వివో నుంచి చౌకగా 252GB స్టోరేజ్‌తో కొత్త మొబైల్ లాంచ్.. ఫీచర్స్, స్పెసిఫికేషన్స్ తెలుసుకోండి!

 

Vivo New Mobile 2024: ప్రముఖ స్మార్ట్ ఫోన్ కంపెనీ వివో తమ కంపెనీని ప్రపంచవ్యాప్తంగా మరింత విస్తరించేందుకు మార్కెట్లో కొత్త కొత్త మొబైల్స్‌ను విడుదల చేస్తోంది. ఇప్పటికే కంపెనీ అతి తక్కువ ధరలోనే ఎక్కువ ఫీచర్లతో విడుదల చేసిన స్మార్ట్ ఫోన్స్‌కి మంచి గుర్తింపు రావడంతో మరో మొబైల్ ను తమ కస్టమర్స్‌కి అందించింది. వివో తమ మిడిల్ రేంజ్ బడ్జెట్ మొబైల్ వై 200 ఐ మోడల్ మార్కెట్లోకి విడుదల చేసింది. ఇది గత సంవత్సరంలో విడుదల చేసిన వై సిరీస్ కు సక్సెరాగా లాంచ్ చేసినట్లు తెలుస్తోంది. ఇది అద్భుతమైన డిజైన్‌తో మార్కెట్లోకి అందుబాటులోకి వచ్చింది. అయితే ఈ స్మార్ట్ ఫోన్‌కి సంబంధించిన ఫీచర్స్ ఏంటో? ఎక్కడెక్కడ ఈ మొబైల్ లభిస్తుందో? దీనికి సంబంధించిన ధర ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

వివో కంపెనీ ఈ స్మార్ట్ ఫోన్ 12gb ర్యామ్, 152gb ఇంటర్నల్ స్టోరేజ్‌తో అందుబాటులోకి తీసుకువచ్చింది. ఇది అద్భుతమైన డిస్ప్లేను కలిగి ఉంటుంది. దీంతో పాటు దీని ఫ్రంట్ సెట్‌లో సెంటర్ పంచ్ హోల్ కట్ అవుట్ డిస్ప్లేన్ కలిగి ఉంటుంది. దీంతో చూడడానికి ఎంతో అందంగా ఆకర్షణీయంగా కనిపిస్తుంది. దీని డిస్ప్లే గరిష్టంగా 1800 నీట్స్ బ్రైట్నెస్‌ను కలిగి ఉంటుంది. అలాగే ఇందులో అదనంగా ర్యామ్‌ను 24GB వరకు పెంచుకునేందుకు ప్రత్యేకమైన ఫీచర్‌ని కూడా అందిస్తోంది. అలాగే ఇది స్నాప్ డ్రాగన్ ఫోర్త్ జనరేషన్ 2 చిప్ సెటప్ పై రన్ అవుతుంది. మొబైల్‌కు సంబంధించిన బ్యాక్ సెటప్ వివరాలుకి వెళ్తే.. ఇది డ్యూయల్ కెమెరాలతో పాటు ఎల్ఈడి ఫ్లాష్ లైట్ ని కూడా కలిగి ఉంటుంది. కెమెరా సెట్‌లో భాగంగా 50 ఎంపీ ప్రధాన కెమెరాతో పాటు 2 ఎంపీ పోర్ట్రైట్ సెన్సార్‌ని కూడా కలిగి ఉంటుంది.

అలాగే ఈ స్మార్ట్ ఫోన్ 8ఎంపి ఫ్రంట్ కెమెరాను కూడా కలిగి ఉంటుంది. ఈ మొబైల్ ఎంతో శక్తివంతమైన 6000 ఎంఏహెచ్ బ్యాటరీతో అందుబాటులోకి వచ్చింది. దీంతోపాటు 44 వాట్ల ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ను కలిగి ఉంటుంది. ఈ స్మార్ట్ ఫోన్ ఓఎస్ విషయానికి వస్తే, ఇది ఆండ్రాయిడ్ 14 ఆధారిత ఆర్గానిస్ ఓఎస్ పై పని చేస్తుంది. అలాగే సేఫ్టీ ఫీచర్స్‌లో భాగంగా బయోమెట్రిక్ లాక్‌ని కూడా కలిగి ఉంటుంది దీంతోపాటు వివిధ రకాల ఫీచర్స్ ను కలిగి ఉంది.

Also Read 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌ ఇవే!

స్మార్ట్ ఫోన్లు కంపెనీ శనివారం చైనా మార్కెట్లోకి విడుదల చేసింది. అయితే త్వరలోనే వివో దీనిని గ్లోబల్ మార్కెట్లోకి కూడా తీసుకురాబోతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే విడుదలకు సంబంధించిన అన్ని రకాల ఏర్పాట్లు చేసినట్లు సమాచారం. ఇది ప్రపంచవ్యాప్తంగా ఉన్న స్మార్ట్‌ఫోన్‌ మార్కెట్స్‌లో లాంచ్ అయితే మొత్తం మూడు కలర్ ఆప్షన్స్‌లో అందుబాటులోకి రాబోతోంది. అలాగే కంపెనీ ఈ స్మార్ట్ ఫోన్‌కి సంబంధించిన ధర వివరాలను కూడా అధికారికంగా వివరించలేదు. అయితే త్వరలోనే ఈ మొబైల్ కు సంబంధించిన ధర ఇతర ఫీచర్స్ అని కూడా వెల్లడించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.

Also Read 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌ ఇవే!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News