Amazon Offer: రూ.75 వేల ఫోన్‌పై బంపర్ ఆఫర్.. అతి తక్కువ ధరకే.. ఎగబడుతున్న జనం

Samsung Galaxy S20 Fe 5G Offer Price: ప్రస్తుతం మారుతున్న కాలానికి అనుగుణంగా ప్రతి ఒక్కరు తమ సెల్‌ఫోన్లను కూడా అప్‌డేట్ చేసుకుంటున్నారు. ఎప్పటికప్పుడు లేటెస్ట్ మోడల్స్ కొనుగోలు చేస్తున్నారు. మీరూ 5జీ ఫోన్ కోసం చూస్తున్నారా..? అయితే ఈ ఫోన్‌పై ఓ లుక్కేయండి..   

Written by - ZH Telugu Desk | Last Updated : Feb 24, 2023, 04:03 PM IST
Amazon Offer: రూ.75 వేల ఫోన్‌పై బంపర్ ఆఫర్.. అతి తక్కువ ధరకే.. ఎగబడుతున్న జనం

Samsung Galaxy S20 Fe 5G Offer Price: కొత్త ఫోన్ కొనుగోలు చేయాలనుకునే వారికి గుడ్‌న్యూస్. అదిరిపోయే ఆఫర్‌లో ఓ సూపర్ ఫోన్ ఒకటి అందుబాటులో ఉంది. భారీ తగ్గింపుతో ఈ ఫోన్‌ను మీరు సొంతం చేసుకోవచ్చు. అతి తక్కువ ధరలోనే శాంసంగ్ 5జీ ఫోన్ కొనుగోలు చేయండి. అమెజాన్‌లో శాంసంగ్ గెలాక్సీ ఎస్20 ఎఫ్ఈ 5జీ (Samsung Galaxy S20 FE 5G) ఫోన్‌పై బంపర్ ఆఫర్ అందుబాటులో ఉంది. సరికొత్త ఫీచర్లతో ఉన్న ఈ ఫోన్‌ ఊహించలేనంత తగ్గింపుతో దొరుకుతోంది. దీని అసలు ధర రూ.74,999 ఉండగా.. 60 శాతం ఆఫర్ ధర పోగా.. రూ.29,999 ధరకే లభిస్తోంది. 

ఈ 5జీ ఫోన్‌లో క్లౌడ్ మింట్, క్లౌడ్ నామీ కలర్ ఫోన్లపై సూపర్ డిస్కౌంట్ అందుబాటులో ఉంది. అమెజాన్‌లో 74,999 రూపాయలకు ఈ ఫోన్ ధరలో లిస్ట్ అవ్వగా.. 29,999కు అందుబాటులో ఉండడంతో వినియోగదారులు కొనుగోలు చేసేందుకు ఎగబడుతున్నారు. Qualcomm Snapdragon 865 ఆక్టా-కోర్ ప్రాసెసర్, 8 జీబీ రామ్, 128 జీవీ ఇంటర్నల్ మెమరీని 1 టీబీ వరకు విస్తరించుకోవచ్చు. ఆండ్రాయిడ్ 11.0 ఆపరేటింగ్ సిస్టమ్‌తో డ్యూయల్ సిమ్ సెటప్ ఉంది. 

కెమెరా విషయానికి వస్తే.. ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. 12 ఎంపీ (డ్యూయల్ పిక్సెల్) OIS F1.8 వైడ్ రియర్ కెమెరా + 8 MP OIS టెలి కెమెరా + 12MP అల్ట్రా వైడ్‌లో అందుబాటులో ఉంది. 30X స్పేస్ జూమ్ కవర్ చేస్తుంది. ఎడమ వైపున ఎల్‌ఈడీ ఫ్లాష్‌తో, కెమెరా మాడ్యూల్ కొద్దిగా ఎక్కువగా ఉంది.

ఫోన్‌లో ఇన్ డిస్‌ప్లే ఫింగర్‌ప్రింట్ సెన్సార్‌ని ఉపయోగించినందున.. వెనుక భాగంలో వేలిముద్ర సెన్సార్‌ను ఇవ్వలేదు. Galaxy S20 FE 5G సన్నగా, తేలికగా ఉండడంతో మీరు ఫోన్‌ను ఎత్తడానికి అస్సలు బరువుగా అనిపించదు. పవర్, వాల్యూమ్ బటన్లు ఫోన్ కుడి వైపున ఉన్నాయి. సిమ్ కార్డ్ ట్రే ఎగువ భాగంలో ఉంది. ఫోన్ దిగువన ప్రాథమిక మైక్రోఫోన్, యూఎస్‌బీ టైప్-C పోర్ట్, స్పీకర్ గ్రిల్ ఉన్నాయి. ఫోన్ 6.5 అంగుళాల ఫుల్ హెచ్‌డీ +(1,080x2,400 పిక్సెల్‌లు) సూపర్ అమోలెడ్ ప్యానెల్ డిస్‌ప్లే ను కలిగి ఉంది. ఫోన్ 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్‌తో అమర్చారు. Android 11 ఆధారిత OneUI 3.0లో పనిచేస్తుంది. 4500 mAh బ్యాటరీ ఉంది. ఇది 25W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. మీరు తక్కువ ధరలో 5జీ ఫోన్ కోసం వెతుకుతున్నట్లు అయితే ఈ ఫోన్ మంచి ఆప్షన్ అని నిపుణులు చెబుతున్నారు. 

Also Read: Pee Gate in Karnataka: బస్సులో నిద్రిస్తున్న మహిళపై మూత్రం పోసిన యువకుడు   

Also Read: Minister Gummanur Jayaram: మంత్రి గుమ్మనూరు కుటుంబంలో తీవ్ర విషాదం    

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

TwitterFacebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News