Apple Iphone 16 Leaks: యాపిల్‌ నుంచి శుభవార్త..Iphone 16 సిరీస్‌ వచ్చేస్తోంది..పూర్తి వివరాలు ఇవే!

iPhone 16 SE, iPhone 16 Plus SE, iPhone 16 Pro Max: ప్రముఖ టెక్‌ కంపెనీ యాపిల్‌ గుడ్‌ న్యూస్‌ తెలిపింది. ప్రీమియం ఫీచర్స్‌ కలిగిన iPhone 16 సిరీస్‌ను త్వరలోనే విడుదల చేయబోతోంది. అయితే దీనిని సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకుందాం. 

Written by - ZH Telugu Desk | Last Updated : Feb 14, 2024, 03:32 PM IST
 Apple Iphone 16 Leaks: యాపిల్‌ నుంచి శుభవార్త..Iphone 16 సిరీస్‌ వచ్చేస్తోంది..పూర్తి వివరాలు ఇవే!

iPhone 16 SE, iPhone 16 Plus SE, iPhone 16 Pro Max: యాపిల్‌ త్వరలోనే గుడ్‌ న్యూస్‌ అందించబోతోంది. ఐఫోన్ 16 మోడల్స్‌కి సంబంధించిన అన్ని స్మార్ట్‌ఫోన్స్‌ డిజైన్స్చ ధర, స్క్రీన్‌ పరిమాణాలు, ఇతర ఫీచర్స్‌ లాంచింగ్‌కి ముందే లీక్‌ అయ్యాయి. ఈ 16 సిరీస్‌ యాపిల్‌ మొబైల్స్‌ను కంపెనీ  ఈ సంవత్సరం నవంబర్‌ లేదా డిసెంబర్‌ నెలలో లాంచ్‌ చేసే అవకాశాలు ఉన్నాయని ప్రముఖ టిప్‌స్టర్స్‌ తెలుపుతున్నారు. ఈ స్మార్ట్‌ఫోన్‌ కొత్త అప్‌డేట్స్‌తో పాటు అనేక రకాల ఫీచర్స్‌తో అందుబాటులోకి రాబోతోంది. త్వరలోనే మార్కెట్‌లోకి విడుదల కాబోతున్నట్లు iPhone 16 సిరీస్‌కి సంబంధించిన లీక్‌ అయిన వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

యాపిల్ కంపెనీ విడుదల చేయబోయే 16 సిరీస్‌లో బ్యాక్‌ సెటప్‌లో కొన్ని కెమెరా లేఅవుట్‌తో అందుబాటులోకి తీసుకురాబోతున్నట్లు తెలుస్తోంది. దీంతో పాటు డిజైన్‌ పరంగా కూడా అనేక రకాల కొత్త మార్పులతో వీటిని అందుబాటులోకి తీసుకు రాబోతున్నట్లు తెలుస్తోంది. యాపిల్‌ కంపెనీ ఈ ఏడాది చివరిలో 16 సిరీస్‌ మొబైల్స్‌తో పాటు iPhone 16 SE, iPhone 16 Plus SE, iPhone 16 స్మార్ట్‌ఫోన్స్‌ కూడా విడుదల కాబోతున్నాయి.

టిప్‌స్టర్ మాజిన్ బు (@MajinBuOfficial) తెలిపిన వివరాల ప్రకారం..ఈ iPhone 16 సిరీస్‌ మొత్తం ఐదు వేరియంట్స్‌లో అందుబాటులోకి రాబోతోందని తెలుస్తోంది. ముఖ్యంగా iPhone 16 SE, Plus SE మొబైల్ సింగిల్‌ కెమెరా సెటప్‌ను కలిగి ఉంటాయని సమాచారం. దీంతో పాటు ఐఫోన్ 16 మోడల్స్‌ డ్యూయల్ రియర్ కెమెరా సెటప్‌తో అందుబాటులోకి వచ్చే ఛాన్స్‌ ఉందని తెలస్తోంది. ఇక iPhone 16 Pro, 16 Pro Max స్మార్ట్‌ఫోన్స్‌ ట్రిపుల్ కెమెరా బ్యాక్‌సెటప్‌తో అందుబాటులోకి వచ్చే అవకాశాలు ఉన్నాయని సమాచారం.

Also Read Ibomma Downloading Option: ఒకే నిమిషంలో ఐ బొమ్మలో మూవీస్ డౌన్‌లోడ్ చేయడం ఎలా?

ధర వివరాలు:
టిప్‌స్టర్ అందించిన వివరాల ప్రకారం యాపిల్‌ ఐఫోన్‌ 16 SE 128GB ఇంటర్నల్‌ స్టోరేజ్‌ కలిగిన వేరియంట్‌ ధర సుమారు రూ. 58,000 ఉండబోతోందని తెలుస్తోంది. ఇక ఐఫోన్ 6 SE ప్లస్ ధర 256GB స్టోరేజ్‌ వేరియంట్ ధర సుమారు రూ. 58,000 ఉండబోతోందని తెలుస్తోంది. ఇక  ఐఫోన్ 16 (256GB ఇంటర్నల్‌ స్టోరేజ్) వేరియంట్  ధర రూ. 58,000, ఐఫోన్‌ 16 Pro (256GB ఇంటర్నల్‌ స్టోరేజ్) ధర రూ.83,000 , మ్యాక్స్‌ (256GB ఇంటర్నల్‌ స్టోరేజ్‌) వేరియంట్‌ రూ.91,000 ఉండే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. 

Also Read Ibomma Downloading Option: ఒకే నిమిషంలో ఐ బొమ్మలో మూవీస్ డౌన్‌లోడ్ చేయడం ఎలా?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి 

 

Trending News