Samsung Galaxy S23 5G Price: అమెజాన్‌ బంఫర్‌ ఆఫర్‌..సాంసంగ్‌ Galaxy S23పై రూ.27,000 పైగా డిస్కౌంట్‌..

Drop Samsung Galaxy S23 5G Price: ప్రముఖ ఈ కామర్స్‌ కంపెనీ అమెజాన్‌లో ఆఫర్ల మోత మొదలైంది. సాంసంగ్‌తో పాటు పలు టెక్‌ బ్రాండ్‌లకు సంబంధించి స్మార్ట్‌ ఫోన్స్‌పై భారీ తగ్గింపును అందిస్తోంది. ఈ మొబైల్‌పై అదనంగా బ్యాంక్‌ ఆఫర్స్‌ కూడా అందుబాటులో ఉన్నాయి. 

Written by - ZH Telugu Desk | Last Updated : Feb 5, 2024, 12:38 PM IST
Samsung Galaxy S23 5G Price: అమెజాన్‌ బంఫర్‌ ఆఫర్‌..సాంసంగ్‌ Galaxy S23పై రూ.27,000 పైగా డిస్కౌంట్‌..

 

Drop Samsung Galaxy S23 5G Price: ప్రముఖ ఈ కామర్స్‌ కంపెనీ అమెజాన్ ఇండియాలో భారీ డిస్కౌంట్‌ ఆఫర్స్‌ కొనసాగుతున్నాయి. కొన్ని ఎలక్ట్రిక్‌ బ్రాండ్‌లపై ప్రత్యేక డీల్స్‌ను కూడా అందిస్తోంది. ముఖ్యంగా స్మార్ట్ ఫోన్స్‌ను కొనుగోలు చేసేవారికి ఇది గొప్ప అవకాశంగా భావించవచ్చు. ప్రముఖ టెక్‌ కంపెనీ ఇటీవలే మార్కెట్‌లోకి విడుదల చేసిన Samsung Galaxy S23 5G, Galaxy S23 FE 5G స్మార్ట్‌ ఫోన్స్‌పై బంఫర్ డిస్కౌంట్‌లతో అందుబాటులో ఉన్నాయి. ఈ రెండు మొబైల్స్‌పై అమెజాన్‌ రూ.10,000కు పైగా ఫ్లాట్‌ తగ్గింపును అందిస్తోంది. దీంతో పాటు అదనంగా ఎక్చేంజ్‌ ఆఫర్స్‌ కూడా అందుబాటులో ఉంచింది. అయితే ఈ మొబైల్‌పై ఉన్న ఆఫర్స్‌ ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. 

అమెజాన్ ఇండియాలో  ఈ స్మార్ట్ ఫోన్‌ రెండు వేరియంట్‌లో అందుబాటులో ఉంది. 8 GB ర్యామ్‌, 256 GB ఇంటర్నల్ స్టోరేజ్‌ కలిగిన Samsung Galaxy S23 5G స్మార్ట్‌ ఫోన్‌ అసలు ధర MRP రూ. 79,999కాగా ప్రత్యేక తగ్గింపులో 31 శాతం తగ్గింపుతో కేవలం రూ. 69,999తో అందుబాటులో ఉంది. దీంతో పాటు అదనంగా బ్యాంక్‌ ఆఫర్స్‌ కూడా లభిస్తున్నాయి.

ఈ మొబైల్‌ను కొనుగోలు చేసే క్రమంలో  HDFC బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌తో బిల్ చెల్లిస్తే దాదాపు  రూ.5,000 వరకు ఫ్లాట్ డిస్కౌంట్ పొందవచ్చు. దీంతో పాటు అదనంగా మరింత తగ్గింపు పొందడానికి ఎక్చేంజ్‌ ఆఫర్‌ను కూడా వినియోగించవచ్చు. ఈ ఆఫర్‌ను వినియోగించి కొనుగోలు చేస్తే దాదాపు రూ.27,000 వరకు తగ్గింపు పొందవచ్చు. దీంతో మీరు ఈ మొబైల్‌ను రూ.42,999కే పొందవచ్చు. 

ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌:
ఈ Samsung Galaxy S23 5G స్మార్ట్‌ ఫోన్‌ డైనమిక్ AMOLED 2x డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. ఈ డిస్ల్పే 120Hz రిఫ్రెష్ రేట్‌ వరకు సపోర్ట్‌ చేస్తుంది. దీంతో పాటు దీని స్క్రీన్‌ ప్రోటక్షన్‌ కోసం కంపెనీ గొరిల్లా గ్లాస్ విక్టస్ గ్లాస్‌ను అందిస్తోంది. ఇది Snapdragon 8 Gen 2 ప్రాసెసర్‌పై రన్‌ అవుతుంది. ఈ మొబైల్‌ బ్యాక్‌ సెట్‌లో ట్రిపుల్‌ కెమెరా సెటప్‌ను కలిగి ఉంటుంది. ఇందులో 50 మెగాపిక్సెల్ ప్రధాన కెమెరా ఉండగా 12+8 మెగాపిక్సెల్ కెమెరాలను కలిగి ఉంటాయి. ఇక ఫ్రంట్‌ కెమెరా విషయానికొస్తే..12 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరాను కలిగి ఉంటుంది. 

Also Read Ibomma Downloading Option: ఒకే నిమిషంలో ఐ బొమ్మలో మూవీస్ డౌన్‌లోడ్ చేయడం ఎలా?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News