Google Pay Convenience Fee On Mobile Recharge: గూగుల్ పేలో మొబైల్ రీఛార్జ్ చేస్తున్నారా..? అయితే పేమెంట్ చేసే ముందు ఒక్కసారి చెక్ చేసుకుని చేయండి. ఇక నుంచి మొబైల్ రీఛార్జ్‌లపై ఫీజు వసూలు చేయనుంది. మీరు కార్డు నుంచి చెల్లించినా.. యూపీఐ నుంచి చెల్లించినా కన్వీనియన్స్ ఫీజు రూపంలో స్వల్ప మొత్తంలో ఫీజు వసూలు చేయనుంది. ఇప్పటికే ఇలాంటి ఛార్జీలు ఫోన్ పే, పేటీఎం వసూలు చేస్తుండగా.. తాజాగా గూగుల్ పే కూడా ప్రారంభించింది. గూగుల్ పేలో ఛార్జీల వసూలు విషయాన్ని ఓ వినియోగదారుడు బయటపెట్టాడు.
Google Payలో తాను రూ.749 జియో రీఛార్జ్‌కుప్రయత్నించగా.. అదనంగా రూ.3 ఛార్జ్‌ని కన్వీనియన్స్ ఫీజు రూపంలో అడుగుతోందని సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. రూ.749 రీఛార్జ్ ప్లాన్, రూ.3 ఎక్స్ ట్రా ఛార్జీ కలిపి రూ.752 చూపిస్తోందన్నారు. అయితే కొందరు యూజర్లకు గూగుల్ పే ఎలాంటి ఛార్జీలను వసూలు చేయడం లేదు. కొందరు యూజర్ల నుంచి ప్రస్తుతం కన్వీనియన్స్ ఫీజు తీసుకుంటుండగా.. త్వరలో అందరి నుంచి వసూలు చేసే అవకాశం ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అయితే ఈ ఫీజు విషయంపై గూగుల్ పే ఎక్కడా అధికారికంగా ప్రకటన జారీ చేయలేదు. అయితే నవంబర్ 10న ఇచ్చిన అప్‌డేట్‌లో సేవా నిబంధనలను స్నీక్ పీక్ చేస్తే.. “Google ఫీజు” అనే కొత్త పదం కనిపిస్తోంది. స్పష్టంగా చెప్పనప్పటికీ ఈ కొత్త ఛార్జీలకు కనెక్షన్ గురించి హింట్ ఇచ్చింది.
ఈ విషయంపై ముకుల్ శర్మ అనే టిప్‌స్టర్ మాట్లాడుతూ.. రూ.100లోపు రీఛార్జీపై గూగుల్‌పే ఎలాంటి ఫీజూ వసూలు చేయబోదని తెలిపాడు. రూ.100-రూ.200 వరకు ఒక రూపాయి, రూ.200 నుంచి రూ.300 వరకు రూ.2, రూ.300 పైగా ఎంతైనా రీఛార్జీ చేసుకుంటే 3 రూపాయల చొప్పున కన్వీనియన్స్ ఫీజు రూపంలో గూగుల్ పే వసూలు చేయనుందని ట్విటర్‌లో పోస్ట్ పెట్టాడు. అయితే మొబైల్ ఛార్జీలపైనే ఈ ఫీజు వసూలు చేయనుందా..? ఇతర పేమెంట్లకు కూడా వర్తింపజేస్తుందా..? అనే విషయంపై క్లారిటీ రావాల్సి ఉంది.
తాజా ఎన్‌పీసీఐ డేటా ప్రకారం.. ఈ ఏడాది అక్టోబర్‌లో యూపీఐ లావాదేవీల వాల్యూమ్‌లలో ఫోన్‌పే వాటా 46 శాతం, గూగుల్ పే 36 శాతం, పేటీఎమ్ మరో 13 శాతంగా ఉంది. అక్టోబర్ 2022 నాటికి ఫోన్ పే వాటా 47 శాతం, గూగుల్ పే వాటా 34 శాతం, పేటీఎం 15 శాతం మార్కెట్ వాటాను ఉంది. అంటే ఏడాదిలో గూగుల్ పే వాటా రెండు శాతం పెరిగింది.
Also Read: Pawan Kalyan: అధికారం ఏ ఒక్కరి సొత్తూ కాదు.. దుబ్బాకలో పవన్ కళ్యాణ్ ఫైర్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook