India Won by 2 Wickets Against Australia: ఉత్కంఠభరితంగా సాగిన తొలి టీ20 మ్యాచ్‌లో ఆసీస్‌పై టీమిండియా రెండు వికెట్ల తేడాతో గెలుపొందింది. హైఓల్టేజీ మ్యాచ్‌లో చివర్లో రింకూ సింగ్ మెరుపులతో జట్టును గెలిపించాడు. విశాఖ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా నిర్ణీత 20 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 208 పరుగుల భారీ స్కోరు చేసింది. జోస్ ఇంగ్లిస్ (110) సెంచరీ బాదగా.. స్టీవ్ స్మిత్ (52) రాణించాడు. అనంతరం టీమిండియా 19.5 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ (80)కుతోడు ఇషాన్ కిషన్ (58) చెలరేగాడు. చివర్లో రింకూ సింగ్ (22) సూపర్ ఫినిష్ ఇవ్వడంతో టీమిండియా గెలుపొందింది. భారత్ విజయానికి చివరి బంతికి ఒక పరుగు అవసరం కాగా.. రింకూ సింగ్ సిక్స్ బాదాడు. అయితే అది నో బాల్ కావడంతో మరో బంతి మిగిలుండగానే విజయం సాధించింది. ఆ సిక్స్ కౌంట్‌లోకి రాలేదు. ఇటీవల వరల్డ్ కప్ ఫైనల్‌లో ఆసీస్ చేతిలో ఓడిపోయిన భారత్‌కు ఇది కాస్త ఊరటనిచ్చే విజయం. ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భారత్ 1-0 ఆధిక్యంలో నిలిచింది.
What A Game!
What A Finish!
What Drama!
1 run to win on the last ball and it's a NO BALL that seals #TeamIndia's win in the first #INDvAUS T20I! 👏 👏
Scorecard ▶️ https://t.co/T64UnGxiJU @IDFCFIRSTBank pic.twitter.com/J4hvk0bWGN
— BCCI (@BCCI) November 23, 2023
టాస్ ఓడి మొదట బ్యాటింగ్ దిగిన ఆసీస్.. ఆరంభం నుంచే దూకుడుగా ఆడింది. ఓపెనర్ మాథ్యూ షార్ట్ (13) తక్కువ స్కోరుకే ఔట్ అయినా.. స్టీవ్ స్మిత్, జోస్ ఇంగ్లిస్ మెరుపులు మెరిపించారు. రెండో వికెట్‌కు 131 పరుగులు జోడించారు. స్టీవ్ స్మిత్ (41 బంతుల్లో 52, 8 ఫోర్లు) రనౌట్ అవ్వగా ఇంగ్లిస్ జోరు కంటిన్యూ చేశాడు. ఇంగ్లిస్ (50 బంతుల్లో 110, 11 ఫోర్లు, 8 సిక్సర్లు) సెంచరీ పూర్తి చేసుకున్న తరువాత ఔట్ అయ్యాడు. టిమ్ డేవిడ్ (13 బంతుల్లో 19 నాటౌట్, 2 ఫోర్లు, ఒక సిక్స్) దూకుడుగా ఆడాడు. టీమిండియా బౌలర్లలో రవి బిష్ణోయ్ (1/54), ప్రసిద్ధ్ కృష్ణ (1/50) భారీగా రన్స్ సమర్పించుకున్నారు.
భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియాకు ఆరంభంలోనే షాక్ తగిలింది. రుతురాజ్ గైక్వాడ్ (0) ఒక్క బంతి ఎదుర్కొకుండానే రనౌట్ అయ్యాడు. జైస్వాల్ (8 బంతుల్లో 21, 2 ఫోర్లు, 2 సిక్సర్లు) దూకుడుగా ఆడినా తక్కువ స్కోరుకే ఔట్ అయ్యాడు. ఆ తరువాత ఇషాన్ కిషన్, సూర్య కుమార్ యాదవ్ ఆసీస్ బౌలర్లను ఆడుకున్నారు. ఇద్దరు పోటీపడి సిక్సర్లు, ఫోర్లు బాదడంతో లక్ష్యం ఇట్టే కరిగిపోయింది. ఇషాన్ కిషన్ (39 బంతుల్లో 58, 2 ఫోర్లు, 5 సిక్స్‌లు), సూర్యకుమార్ యాదవ్ (42 బంతుల్లో 80, 9 ఫోర్లు, 4 సిక్స్‌లు) షాట్లతో మోత మోగించడంతో ఫ్యాన్స్ తెగ ఎంజాయ్ చేశారు. ఇక చివర్లో వరుసగా వికెట్లు కోల్పోవడంతో ఉత్కంఠ నెలకొన్నా.. రింకూ సింగ్ (22 నాటౌట్) కూల్‌గా ఇన్నింగ్స్ ముగించాడు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook