Google Pixel 7a Price: ఫ్లిఫ్‌కార్ట్‌లో Google Pixel 7a వెరీ చీప్‌.. రూ.7 వేలకే మీ సొంతం..

Google Pixel 7a Price Cut: ఫ్లిఫ్‌కార్ట్‌లో Google Pixel 7a స్మార్ట్‌ఫోన్‌ కొనుగోలు చేయాలనుకునేవారికి ఇదే సరైన సమయంగా భావించవచ్చు. ప్రత్యేకమైన సేల్‌లో ఈ స్మార్ట్‌ఫోన్ వెరీ చీప్‌ ధరకే వస్తోంది. ఎలా కొనుగోలు చేయాలో తెలుసుకోండి. 

Written by - Dharmaraju Dhurishetty | Last Updated : Aug 10, 2024, 05:38 PM IST
Google Pixel 7a Price: ఫ్లిఫ్‌కార్ట్‌లో Google Pixel 7a వెరీ చీప్‌.. రూ.7 వేలకే మీ సొంతం..

 

Google Pixel 7a Price Cut: అతి తక్కువ ధరలోనే మంచి స్మార్ట్‌ఫోన్‌ను కొనుగోలు చేయాలనుకుంటున్నారా? గూగుల్‌ కంపెనీ లాంచ్‌ చేసిన 7a మొబైల్‌ భారీ డిస్కౌంట్‌తో లభిస్తోంది. దీంతో పాటు అదనంగా బ్యాంక్ ఆఫర్స్‌ కూడా అందుబాటులో ఉన్నాయి. అత్యధిక తగ్గింపుతో కొనుగోలు చేయాలనుకునేవారికి ఇది సరైన సమయంగా భావించవచ్చు. ఫ్లిఫ్‌కార్ట్‌లో ఈ మొబైల్‌ డెడ్‌ చీప్‌ ధరకే లభిస్తోంది. ఈ మొబైల్‌ ప్రీమియం కెమెరా సెటప్‌తో అందుబాటులోకి వచ్చింది. ఇది ప్రీమియం ప్రాసెసర్‌ను కలిగి ఉంటుంది. అయితే ఈ స్మార్ట్‌ఫోన్‌పై ఉన్న ఇతర ఆఫర్స్‌ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..
 
ప్రస్తుతం మార్కెట్‌లో ఈ Google Pixel 7a స్మార్ట్‌ఫోన్‌ నాలుగు కలర్‌ ఆప్షన్స్‌లో అందుబాటులో ఉంది. ఇందులో 128 GB ఇంటర్నల్‌ స్టోరేజ్‌ కలిగిన స్మార్ట్‌ఫోన్‌ MRP ధర రూ.43,999తో అందుబాటులో ఉంది. ప్రత్యేకమైన సేల్‌లో భాగంగా కొనుగోలు చేసేవారికి దాదాపు 15 శాతం వరకు తగ్గింపు లభిస్తోంది. దీంతో అదనంగా డిస్కౌంట్ పొందాలనుకునేవారు బ్యాంక్‌ ఆఫర్స్‌ను వినియోగించి బిల్‌ చెల్లిస్తే భారీ తగ్గింపు కూడా లభిస్తుంది. 

ఇక ఈ మొబైల్‌పై ఉన్న బ్యాంక్‌ ఆఫర్స్‌ వివరాల్లోకి వెళితే.. దీనిని యాక్సిస్‌ బ్యాంక్‌ క్రెడిట్‌ కార్డ్‌ను వినియోగించి పేమెంట్‌ చేస్తే దాదాపు 5 శాతం వరకు తగ్గింపు లభిస్తుంది. అంతేకాకుండా  BOBCARDను వినియోగించి పేమెంట్ చేస్తే దాదాపు రూ.1,500 వరకు డిస్కౌంట్ పొందవచ్చు. అలాగే YES బ్యాంక్‌ క్రెడిట్‌ను వినియోగించి పేమెంట్‌ చేసేవారికి కూడా భారీ తగ్గింపు లభిస్తుంది. దీంతో ఆఫర్స్‌ అన్ని పోను ఈ Google Pixel 7a స్మార్ట్‌ఫోన్‌ను కేవలం రూ.35,499కే పొందవచ్చు. 

అలాగే ఈ Google Pixel 7a మొబైల్‌పై అదనంగా బ్యాంక్‌తో పాటు ఎక్చేంజ్‌ ఆఫర్‌ కూడా అందుబాటులో ఉంది. దీనిని వినియోగించి కొనుగోలు చేసేవారికి భారీ డిస్కౌంట్‌ తగ్గింపు లభిస్తుంది. దీని కోసం ముందుగా పాత స్మార్ట్‌ఫోన్‌ను ఎక్చేంజ్‌ ఇవ్వాల్సి ఉంటుంది. ఇలా ఇస్తే దాదాపు రూ.28,099 వరకు తగ్గింపు లభిస్తుంది. దీంతో ఆఫర్స్‌ అన్ని పోను ఈ మొబైల్‌ను కేవలం రూ.7,400కే పొందవచ్చు. ఇవే కాకుండా మరింత తగ్గింపు పొందడానికి అదనంగా ప్రత్యేకమైన కూపన్స్‌ కూడా అందుబాటులో ఉన్నాయి. అవి తెలుసుకోవడానికి ఫ్లిప్‌కార్ట్‌ అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించాల్సి ఉంటుంది.

ఇది కూడా చదవండి: Lakshmi Narayana Raja Yoga: లక్ష్మీ నారాయణ రాజయోగం ఏర్పాటు.. ఈ రాశుల వారు కుబేరులు కాబోతున్నారు..

ఇది కూడా చదవండి: 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌ ఇవే!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News