Infinix Note 40 Pro: 108MP కెమేరా 8GB Ramతో ఇన్ఫినిక్స్ ఫోన్ 20 వేలకే

Infinix Note 40 Pro: ప్రముఖ స్మార్ట్‌ఫోన్ కంపెనీ ఇన్ఫినిక్స్ నుంచి కొత్తగా మరో మోడల్ లాంచ్ అయింది. 108 మెగాపిక్సెల్ కెమేరాతో అందర్నీ ఇట్టే ఆకట్టుకుంటున్న ఈ ఫోన్‌పై ఫ్లిప్‌కార్ట్‌లో మంచి ఆఫర్లు కూడా అందుబాటులో ఉన్నాయి. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. 

Written by - Md. Abdul Rehaman | Last Updated : Jun 10, 2024, 01:22 PM IST
Infinix Note 40 Pro: 108MP కెమేరా 8GB Ramతో ఇన్ఫినిక్స్ ఫోన్ 20 వేలకే

Infinix Note 40 Pro: Infinix Note 40 Pro కొత్తగా మార్కెట్‌లో హల్‌చల్ చేస్తోంది. ఈ ఫోన్ ఫీచర్లు అందర్నీ ఆకట్టుకుంటున్నాయి. ఏకంగా 8 జీబీ ర్యామ్, 256 జీబీ స్టోరేజ్ కలిగి ఉండటమే కాకుండా 108 మెగాపిక్సెల్ కెమేరా కావడంతో అందరూ ఆసక్తి చూపిస్తున్నారు. మరోవైపు ఫ్లిప్‌కార్ట్‌లో వివిధ బ్యాంకు ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి.

Infinix Note 40 Pro ఫోన్ 6.78 ఇంచెస్ ఫుల్ హెచ్‌డి ప్లస్ కర్వ్డ్ ఎమోల్డ్ డిస్‌ప్లేతో 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 1300 నిట్స్ బ్రైట్‌నెస్ కలిగి ఉంటుంది. 2160 హెర్ట్జ్ డిమ్మింగ్, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్‌తో లాంచ్ అయింది. ఈ ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 7020 చిప్‌సెట్‌తో ఆండ్రాయిడ్ 14 ఆధారంగా పనిచేస్తుంది. ఇందులో 45 వాట్స్ సూపర్‌ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉండటమే కాకుండా 5000 ఎంఏహెచ్ బ్యాటరీ సపోర్ట్ చేస్తుంది. వైర్‌లెస్ అయితే 20 వాట్స్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. 26 నిమిషాల్లో 50 శాతం ఛార్జ్ అవుతుంది. ఇన్ డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్, స్టీరియో స్పీకర్లు, ఐపీఎస్ 53 రేటింగ్ డస్ట్, వాటర్ రెసిస్టెన్స్ ఉన్నాయి. 

8 జీబీ ర్యామ్, 256 జీబీ స్టోరేజ్ కలిగి ఉంటుంది. ఇందులో ట్రిపుల్ కెమేరా సెటప్ ఉంది.108 మెగాపిక్సెల్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ ప్రైమరీ కెమేరా, 2 మెగాపిక్సెల్ డెప్త్ కెమేరాతో పాటు సెల్ఫీ లేదా వీడియో కాలింగ్ కోసం 32 మెగాపిక్సెల్ కెమేరా ఉన్నాయి. Infinix Note 40 Pro ధర 21,999 రూపాయలు కాగా హెచ్‌డిఎఫ్‌సి, ఐసీఐసీఐ, యాక్సిస్ బ్యాంకు కార్డుల ద్వారా కొనుగోలు చేస్తే గరిష్టంగా 2000 రూపాయలు డిస్కౌంట్ పొందవచ్చు. అంటే 20 వేలలోపే ఈ ఫోన్ సొంతం చేసుకోవచ్చు.

Also read: Smartphone Usage Tips: మీ స్మార్ట్‌ఫోన్ హ్యాకింగ్ కాకుండా ఉండాలంటే వారానికోసారి ఇలా చేయండి

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News