iQOO Z9x 5G Price: 6000mAh బ్యాటరీ iQOO Z9x 5G స్మార్ట్‌ఫోన్‌ కేవలం రూ.898కే.. ఎలా కొనుగోలు చేయాలో తెలుసా?

iQOO Z9x 5G Price: ప్రీమియం ఫీచర్స్‌తో కూడిన iQOO Z9x 5G స్మార్ట్‌ఫోన్‌ భారీ డిస్కౌంట్‌తో లభిస్తోంది. దీనిని ఇప్పుడే కొనుగోలు చేసేవారికి రూ.898కే లభిస్తోంది. దీంతో పాటు అదనంగా బ్యాంక్‌ ఆఫర్స్‌ కూడా అందుబాటులో ఉన్నాయి.

Written by - Dharmaraju Dhurishetty | Last Updated : Aug 16, 2024, 01:16 PM IST
iQOO Z9x 5G Price: 6000mAh బ్యాటరీ iQOO Z9x 5G స్మార్ట్‌ఫోన్‌ కేవలం రూ.898కే.. ఎలా కొనుగోలు చేయాలో తెలుసా?

iQOO Z9x 5G Price Cut: ఎప్పటి నుంచో జంబో బ్యాటరీ కలిగిన స్మార్ట్‌ఫోన్‌ను కొనుగోలు చేయాలనుకుంటున్నారా? అమెజాన్‌లో 6000mAh బ్యాటరీ కలిగిన మొబైల్స్‌ డెడ్ చీప్‌ ధరకే లభిస్తున్నాయి. ముఖ్యంగా iQOO Z9x 5G మొబైల్‌ను కొనుగోలు చేసేవారికి ప్రత్యేకమైన డిస్కౌంట్‌తో అందిస్తోంది. అంతేకాకుండా అదనంగా ఈ స్మార్ట్‌ఫోన్‌ ప్రత్యేకమైన బ్యాంక్‌ ఆఫర్స్‌తో లభిస్తోంది. ఈ స్మార్ట్‌ఫోన్‌ 7.99mm స్లైట్‌ డిజైన్‌ ఆప్షన్‌తో అందుబాటులో ఉంది. ఇవే కాకుండా అనేక రకాల ప్రీమియం ఫీచర్స్‌తో అందుబాటులో ఉంది. అయితే ఈ మొబైల్‌పై అందుబాటులో ఉన్న ఆఫర్స్‌ వివరాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

ఈ iQOO Z9x 5G స్మార్ట్‌ఫోన్‌ 128GB ఇంటర్నల్‌ స్టోరేజ్‌తో పాటు 4GB ర్యామ్‌ సెటప్‌తో అందుబాటులో ఉంది. ఈ మొబైల్‌ మార్కెట్‌లో MRP ధర రూ.17,999తో అందుబాటులో ఉంది. అయితే దీనిని అమెజాన్‌లోని లిమిటెడ్‌ టైమ్‌ డీల్‌లో భాగంగా కొనుగోలు చేసేవారికి దాదాపు 28 శాతం వరకు డిస్కౌంట్‌ లభిస్తోంది. దీంతో ఈ ఫ్లాట్‌ డిస్కౌంట్‌ ఆఫర్‌ పోను రూ.12,998కే పొందవచ్చు. అలాగే బ్యాంక్‌ ఆఫర్స్‌ను వినియోగించాలనుకునేవారు బ్యాంక్‌ క్రెడిట్‌ కార్డ్‌లతో పేమెంట్‌ చేయాల్సి ఉంటుంది. 

దీనిని బ్యాంక్‌ ఆఫర్స్‌తో కొనుగోలు చేయాలనుకునేవారు అన్ని బ్యాంక్‌లకు సంబంధించిన క్రెడిట్‌ కార్డ్‌ లేదా డెబిట్‌ కార్డ్‌లను వినియోగించి పేమెంట్ చేస్తే దాదాపు రూ.1,000 వరకు తగ్గింపు లభిస్తుంది. దీంతో పాటు ICICI బ్యాంక్‌ క్రెడిట్ కార్డ్‌తో పేమెంట్‌ చేసి EMI ఆప్షన్‌ చూస్‌ చేసుకునేవారికి కూడా నోకాస్ట్‌ EMI ఆప్షన్‌ కూడా లభిస్తోంది. దీంతో ఈ ఆఫర్స్‌ అన్ని పోను ఈ మొబైల్‌ను కేవలం రూ.11,998కే పొందవచ్చు. ఇవే కాకుండా ఈ మొబైల్‌పై అదనంగా ఎక్చేంజ్‌ ఆఫర్‌ కూడా లభిస్తోంది. దీనిని వినియోగించి పేమెంట్‌ చేసేవారికి డెడ్ చీప్‌ ధరకే పొందవచ్చు. ఎక్చేంజ్‌ ఆఫర్స్‌లో భాగంగా పాత మొబైల్‌ను అమెజాన్‌కు ఇస్తే దాదాపు రూ.12,100 వరకు డిస్కౌంట్ బోనస్‌ కూడా లభిస్తుంది. దీంతో ఈ ఎక్చేంజ్‌ ఆఫర్‌ కూడా పోను కేవలం రూ.898కే ఈ iQOO Z9x 5G స్మార్ట్‌ఫోన్‌ను పొందవచ్చు. 

ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌:
డిస్ప్లే:

6.72 అంగుళాల LCD డిస్ప్లే
120Hz రిఫ్రెష్ రేటు
1000 నిట్స్ గరిష్ట ప్రకాశం
ప్రాసెసర్:
క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 6 జెన్ 1 చిప్సెట్

కెమెరా:
50MP ప్రధాన కెమెరా
2MP సెకండరీ కెమెరా
16MP సెల్ఫీ కెమెరా

బ్యాటరీ:
6000mAh బ్యాటరీ
44W ఫాస్ట్ ఛార్జింగ్

మెమోరీ:
8GB RAM + 128GB స్టోరేజ్
12GB RAM + 256GB స్టోరేజ్

ఇతర ఫీచర్స్‌:
ఆండ్రాయిడ్ 14 ఆధారిత OS
వై-ఫై 5, బ్లూటూత్ 5.1
డ్యూయల్ స్టీరియో స్పీకర్లు
IP64 రేటింగ్ 

ఇది కూడా చదవండి: Lakshmi Narayana Raja Yoga: లక్ష్మీ నారాయణ రాజయోగం ఏర్పాటు.. ఈ రాశుల వారు కుబేరులు కాబోతున్నారు..

ఇది కూడా చదవండి: 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌ ఇవే!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News