Jio-Netflix Prepaid Plans: జియో నుంచి అదిరిపోయే ఆఫర్లు.. ఈ ప్లాన్స్‌తో ఫ్రీగా నెట్‌ఫ్లిక్స్ సబ్‌స్క్రిప్షన్‌

Offers On JIO Recharge Plans: జియో ప్రీపెయిడ్ కస్టమర్లకు గుడ్‌న్యూస్. తొలిసారి నెట్‌ఫ్లిక్స్ సబ్‌స్క్రిప్షన్‌తో రీఛార్జ్ ప్లాన్లను తీసుకువచ్చింది. రూ.1099, రూ.1499 ప్లాన్లను కస్టమర్లకు పరిచయం చేసింది. పూర్తి వివరాలు ఇలా..  

Written by - Ashok Krindinti | Last Updated : Aug 24, 2023, 09:57 PM IST
Jio-Netflix Prepaid Plans: జియో నుంచి అదిరిపోయే ఆఫర్లు.. ఈ ప్లాన్స్‌తో ఫ్రీగా నెట్‌ఫ్లిక్స్ సబ్‌స్క్రిప్షన్‌

Offers On JIO Recharge Plans: రిలయన్స్ జియో సరికొత్త డీల్‌తో వినియోగదారుల ముందుకు వచ్చింది. జియో నెట్‌ఫ్లిక్స్ సబ్‌స్క్రిప్షన్‌తో వచ్చే రెండు కొత్త 'జియో-నెట్‌ఫ్లిక్స్ ప్రీపెయిడ్ ప్లాన్‌లను' కస్టమర్లకు అందుబాటులోకి తీసుకువచ్చింది. రూ.1099 ప్లాన్‌తో కస్టమర్‌లు రోజుకు 2 జీబీ డేటాను పొందుతారు. అదే సమయంలో 1499 రూపాయల ప్లాన్‌తో రోజుకు 3 జీబీ డేటాను అందిస్తోంది. రెండు ప్లాన్‌ల వాలిడిటీ 84 రోజులు ఉంటుంది. ఎంచుకున్న జియో పోస్ట్‌పెయిడ్, జియో ఫైబర్ ప్లాన్‌లలో నెట్‌ఫ్లిక్స్ సబ్‌స్క్రిప్షన్ ఇప్పటికే అందుబాటులో ఉండగా.. ప్రీపెయిడ్ ప్లాన్‌లలో నెట్‌ఫ్లిక్స్ సబ్‌స్క్రిప్షన్ అందుబాటులో ఉండటం ఇదే మొదటిసారి.

నెట్‌ఫ్లిక్స్ బండిల్ టెల్కో ప్రీపెయిడ్ ప్లాన్ ద్వారా ప్రారంభించడం ప్రపంచంలోనే తొలిసారి కావడం విశేషం. దీంతో జియోకు ఉన్న ప్రస్తుతం 40 కోట్లకు పైగా ప్రీపెయిడ్ కస్టమర్‌లు నెట్‌ఫ్లిక్స్ సబ్‌స్క్రిప్షన్‌తో ప్లాన్‌లను ఎంచుకునే అవకాశం కలగనుంది. నెట్‌ఫ్లిక్స్‌తో కస్టమర్‌లు తమ మొబైల్‌లో ఎప్పుడైనా, ఎక్కడైనా హాలీవుడ్ నుంచి బాలీవుడ్, మన దేశంలో అన్ని భాషల సినిమాలు, ప్రముఖ టీవీ షోలను చూడనున్నారు. జియో ఇతర ప్లాన్‌ల మాదిరిగానే.. కస్టమర్‌లు రెండు ప్లాన్‌లకు ఆన్‌లైన్ లేదా ఆఫ్‌లైన్ ద్వారా రీఛార్జ్ చేసుకోవచ్చు.

ఈ ప్లాన్‌ల లాంచ్ సందర్భంగా జియో ప్లాట్‌ఫామ్స్ లిమిటెడ్ సీఈఓ కిరణ్ థామస్ మాట్లాడుతూ.. తమ కస్టమర్‌లకు ప్రపంచ స్థాయి సేవలను అందించడానికి కట్టుబడి ఉన్నామని తెలిపారు. తమ ప్రీపెయిడ్ ప్లాన్‌లతో కూడిన నెట్‌ఫ్లిక్స్ ప్రారంభం మరో ముందు అడుగు అని అన్నారు. నెట్‌ఫ్లిక్స్ వంటి గ్లోబల్ పార్టనర్‌లతో తమ భాగస్వామ్యాలు మరింత పటిష్టంగా పెరిగాయని అన్నారు. 

నెట్‌ఫ్లిక్స్‌లో ఏపీఏసీ పార్టనర్‌షిప్‌ల వైస్ ప్రెసిడెంట్ టోనీ జెమ్‌కోవ్సీక్‌ మాట్లాడుతూ.. జియోతో తమ సంబంధాన్ని విస్తరించడానికి సంతోషిస్తున్నామని చెప్పారు. గత కొన్నేళ్లుగా తాము అనేక విజయవంతమైన లోకల్ షోలు, డాక్యుమెంటరీలు, మూవీలను స్ట్రీమింగ్ చేశామని.. వీటిని భారతదేశం అంతటా ప్రేక్షకులు ఇష్టపడుతున్నారని తెలిపారు. జియోతో కొత్త ప్రీపెయిడ్ బండిల్ భాగస్వామ్యం కస్టమర్‌లకు భారతీయ కంటెంట్‌తో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న కంటెంట్‌కు యాక్సెస్‌ను అందిస్తున్నట్లు చెప్పారు. 

Also Read: Samantha Ruth Prabhu: ఛాన్స్ వస్తే ఒంటరిగా బతికేయండి.. సమంత పోస్ట్ అర్థం అదేనా..?  

Also Read: 69th National Film Awards 2023 Winners: అల్లు అర్జున్, RRR, ఉప్పెన, చంద్రబోస్..

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook 

Trending News