Oneplus 12 5G Price: అత్యంత చౌకగా మార్కెట్లోకి విడుదల కాబోయే Oneplus స్మార్ట్ ఫోన్ ఇదే..ధర, ఫీచర్ల పూర్తి వివరాలు..

Oneplus 12 5G Price: త్వరలోనే ప్రముఖ చైనీస్ కంపెనీ వన్ ప్లస్ మరో స్మార్ట్ ఫోన్ ను విడుదల చేయబోతోంది. ఈ స్మార్ట్ ఫోన్ OnePlus 12 5G పేరుతో మార్కెట్లో లభించబోతోందని తెలుస్తోంది. అయితే ఈ స్మార్ట్ ఫోన్ కి సంబంధించిన మరిన్ని వివరాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం.

Written by - ZH Telugu Desk | Last Updated : Oct 24, 2023, 12:55 PM IST
Oneplus 12 5G Price: అత్యంత చౌకగా మార్కెట్లోకి విడుదల కాబోయే Oneplus స్మార్ట్ ఫోన్ ఇదే..ధర, ఫీచర్ల పూర్తి వివరాలు..

 

Oneplus 12 5G Price: టెక్నాలజీ పెరుగుతున్న కొద్దీ టెక్ కంపెనీలు కూడా కొత్త కొత్త స్మార్ట్ ఫోన్స్‌ను మార్కెట్లోకి విడుదల చేస్తున్నాయి. ఎప్పటికప్పుడు మారుతున్న జీవనశైలి ని దృష్టిలో పెట్టుకొని కొత్త కొత్త ఫీచర్స్‌తో స్మార్ట్ ఫోన్స్ లభిస్తున్నాయి. ముఖ్యంగా కొన్ని బ్రాండ్లకు సంబంధించిన స్మార్ట్ ఫోన్స్ తక్కువ ధరకే ప్రీమియం ఫీల్ చేస్తున్న కలిగి ఉంటున్నాయి. అయితే ప్రముఖ స్మార్ట్ ఫోన్ కంపెనీ వన్ ప్లస్ కూడా త్వరలోనే అతి తక్కువ ధరలో ప్రీమియం ఫీచర్స్ కలిగిన స్మార్ట్ ఫోన్ ను భారత్ లో విడుదల చేయబోతున్నట్లు తెలుస్తోంది. 

ప్రముఖ స్మార్ట్ ఫోన్ కంపెనీ వన్ ప్లస్ అక్టోబర్ 19వ తేదీన OnePlus 12 5G స్మార్ట్ ఫోన్ ను చైనా మార్కెట్లోకి విడుదల చేసింది. ప్రస్తుతం ఈ స్మార్ట్ ఫోన్ కు సంబంధించిన ఫ్రీ బుకింగ్ సెల్ ని కూడా కంపెనీ ప్రారంభించింది. ఈ స్మార్ట్ ఫోన్ కి సంబంధించిన ఫీచర్స్ స్పెసిఫికేషన్స్ సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారాయి. ఈ OnePlus 12 5G మరిన్ని వివరాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం.

Also Read:  King Cobra Viral Video: వీడి ధైర్యానికి దండేసి దండం పెట్టాల్సిందే.. కింగ్ కోబ్రాకు బాత్ రూమ్‌లో స్నానం  

50W వైర్‌లెస్ ఛార్జింగ్:
టిప్‌స్టర్ డిజిటల్ చాట్ స్టేషన్ తెలిపిన వివరాల ప్రకారం..OnePlus 12 స్మార్ట్ ఫోన్ 50W వైర్‌లెస్ ఛార్జింగ్ సపోర్టును కలిగి ఉంటుంది. అంతేకాకుండా ఈ మొబైల్ ఆపరేట్ వెర్షన్తో కూడిన హార్డ్‌వేర్ తో విడుదలైంది. ఈ మొబైల్ ఫోన్లో అనేక రకాల కొత్త ఫీచర్స్ అందుబాటులో ఉన్నాయి.

దీంతోపాటు ఈ స్మార్ట్ ఫోన్ హ్యాండ్‌సెట్ USB 3.2 టైప్-సి పోర్ట్‌ ను కలిగి ఉంటుంది. అంతేకాకుండా డేటా ట్రాన్స్మిషన్ కోసం అప్‌గ్రేడ్ టెక్నాలజీతో కూడిన USB 2.0 కూడిన పోర్టును కూడా కలిగి ఉంటుంది. ఈ మొబైల్ ఫోన్ స్నాప్‌డ్రాగన్ 8 Gen 3 CPUపై రన్ అవ్వబోతోంది. దీంతోపాటు Adreno 750 GPUని కలిగి ఉంటుంది. ఈ స్మార్ట్ ఫోన్ Android 13 OS పై రన్ అవుతుందని టెక్ నిపుణులు చెబుతున్నారు. ఈ మొబైల్ ఫోన్ 5,000mAh బ్యాటరీ ప్యాక్ ని కలిగి ఉంటుంది.

Also Read:  King Cobra Viral Video: వీడి ధైర్యానికి దండేసి దండం పెట్టాల్సిందే.. కింగ్ కోబ్రాకు బాత్ రూమ్‌లో స్నానం  

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

TwitterFacebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News