Portronics Ampbox 27K Power Bank: టెక్ పరికరాల తయారీలో టెక్ బ్రాండ్ పోర్ట్రోనిక్స్ దూసుకుపోతోంది. ఇటీవలే మార్కెట్లో K2 మెకానికల్ గేమింగ్ కీబోర్డ్ లాంచ్ చేసి సంచనం సృష్టించింది. అంతేకాకుండా జనవరి నెలలో మార్కెట్లో తిరుగులేని బీమ్ 430 స్మార్ట్ LED ప్రొజెక్టర్‌ను విడుదల చేసిన అందరికీ తెలిసిందే. అయితే ఇప్పుడు ఇదే కంపెనీ ల్యాప్‌ట్యాప్‌లకు సైతం చార్జింగ్ అందించే పోర్ట్రోనిక్స్ Ampbox 27K పవర్ బ్యాంక్‌ను మార్కెట్లోకి లాంచ్ చేసింది. గతంలో ఈ పవర్ బ్యాంక్‌కి సంబంధించిన ఫీచర్స్, స్పెషిఫికేషన్స్ లీక్ అయిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు ఇవే ఫీచర్స్, పవర్ బ్యాంక్ అధికారికంగా లాంచ్ అయ్యింది. అయితే దీనికి సంబంధించిన పూర్తి వివరాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
అంతేకాకుండా ఈ పోర్ట్రోనిక్స్ Ampbox 27K పవర్ బ్యాంక్ ఇప్పటికే కొన్ని ఈ కామర్స్ కంపెనీ వెబ్‌సైట్స్‌లో అందుబాటులోకి వచ్చింది. కంపెనీ వెల్లడించిన అధికారిక వివరాల ప్రకారం..ఈ పవర్ బ్యాంక్ పోర్ట్రోనిక్స్ అధికారిక వెబ్‌సైట్‌తో పాటు ఈ కామర్స్ కంపెనీలు Amazon, Flipkartలో లభిస్తోంది. ఇక ఈ పవర్ బ్యాంక్ ధర వివరాల్లోకి వెళితే..కంపెనీ దీనిని 12 నెలల వారంటీతో భారత్‌లో కేవలం రూ.3,999తో అందిస్తున్నట్లు సమాచారం.
పోర్ట్రోనిక్స్ Ampbox 27K పవర్ బ్యాంక్ స్పెక్స్ వివరాలు:
ఈ పోర్ట్రోనిక్స్ Ampbox 27K పవర్ బ్యాంక్ 2 అంగుళాల మందంతో కంపెనీ లాంచ్ చేసినట్లు వెల్లడించింది. అంతేకాకుండా ఎక్కడికంటే అక్కడికి తీసుకెళ్లేందుకు, ప్రయాణాల్లో మొబైల్స్, ల్యాప్‌ట్యాప్స్ ఛార్జ్ చేసేందుకు 6 అంగుళాల పొడవుతో రాబోతోంది. దీనిని కంపెనీ హై గ్రేడ్ మెటీరియల్‌ను వినియోగించి తయారు చేసిన్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా ఇది 27,000mAh బ్యాటరీ సామర్థ్యంతో అందుబాటులోకి వచ్చింది. దీంతో పాటు 65W వరకు ఫాస్ట్ ఛార్జింగ్ అవుట్‌పుట్‌ను కలిగి ఉండబోతున్నట్లు తెలుస్తోంది.
ఇతర ఫీచర్లు, స్పెసిఫికేషన్లు:
27000 mAh బ్యాటరీ సామర్థ్యం
USB-C పోర్ట్‌తో 65 వాట్స్ గరిష్ట అవుట్‌పుట్:
నాలుగు ఛార్జింగ్ పోర్ట్‌లు (2 USB-A, 2 USB-C)
LED డిస్ప్లే
కంపాక్ట్, పోర్టబుల్ డిజైన్
ప్రీమియం మ్యాట్ ఫినిష్
5V/3A, 9V/2A, 12V/2.5A (USB-A), 5V/3A, 9V/3A, 12V/3A, 15V/3A, 20V/3.25A (USB-C) అవుట్‌పుట్
5V/2A, 9V/2A (USB-C) ఇన్పుట్
146.7 x 67.8 x 23.2 mm పరిమాణాలు
525 గ్రాముల బరువు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter