Realme C63 Sales: 50MP కెమేరా 5000mAh బ్యాటరీ ఫోన్ కేవలం 8999 రూపాయలకే, ఎలాగంటే

Realme C63 Sales: బ్రాండెడ్ కంపెనీ, మంచి కెమేరా రిజల్యూషన్, బ్యాటరీ బ్యాకప్ కలిగిన స్మార్ట్‌ఫోన్ కొనాలని ప్రతి ఒక్కరికీ ఉంటుంది. కానీ బడ్జెట్ సహకరించకపోవడంతో వెనుకంజ వేస్తుంటారు. అయితే ఇప్పుడా ఆందోళన అవసరం లేదు. అద్భుతమైన ఫీచర్లు కలిగిన స్మార్ట్‌ఫోన్ అత్యంత తక్కువ ధరకే సొంతం చేసుకోవచ్చు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. 

Written by - Md. Abdul Rehaman | Last Updated : Jul 4, 2024, 11:31 AM IST
Realme C63 Sales: 50MP కెమేరా 5000mAh బ్యాటరీ ఫోన్ కేవలం 8999 రూపాయలకే, ఎలాగంటే

Realme C63 Sales: ప్రముఖ చైనా స్మార్ట్‌ఫోన్ దిగ్గజం రియల్‌మి ఇండియన్ మార్కెట్‌లో Realme C63 లాంచ్ చేసింది. అద్భుతమైన ఫీచర్లు, కెమేరాతో పాటు తక్కువ ధరకే లభించనుంది. రియల్‌మి కొత్తగా లాంచ్ చేసిన ఈ ఫోన్ ఫ్లిప్‌కార్ట్ నుంచి అధికారికంగా కొనుగోలు చేయవచ్చు. 

Realme C63 స్మార్ట్‌ఫోన్ 6.74 ఇంచెస్ హెచ్‌డి ప్లస్ డిస్‌ప్లేతో 720/1600 పిక్సెల్ రిజల్యూషన్ , 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 450 నిట్స్ బ్రైట్‌నెస్ కలిగి ఉంటుంది. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 14 ఆధారంగా పనిచేస్తుంది. ఇది ఆక్టా కోర్ యునిసాక్ చిప్‌సెట్ కలిగి ఉంటుంది. 45 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్‌తో 5000 ఎంఏహెచ్ బ్యాటరీ కలిగి ఉంటుంది. ఐపీ 54 రేటింగ్‌తో డస్ట్, వాటర్ రెసిస్టెంట్ ఫీచర్ కలిగి ఉంటుంది. ఇక కనెక్టివిటీ చూసుకుంటే 4జి, బ్లూటూత్ 5, వైఫై 5 ఫీచర్లున్నాయి. ఈ ఫోన్ 4జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ కలిగి ఉంది. మైక్రో ఎస్డీ కార్డు ద్వారా గరిష్టంగా 2టీబీ వరకూ స్టోరేజ్ పెంచుకోవచ్చు.

ఇక Realme C63 కెమేరా అయితే 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమేరా ఉంది. సెల్ఫీ లేదా వీడియో కాలింగ్ కోసం 8 మెగాపిక్సెల్ కెమేరా ఉంది. Realme C63 ఫోన్ ఎర్లీ సేల్స్ ఇవాళ్టి నుంచి జూలై 6 వరకూ కొనసాగుతోంది. ఈ ఫోన్ ధర 8999 రూపాయలుగా ఉంది. ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ కార్డు ద్వారా కొనుగోలు చేస్తే 5 శాతం డిస్కౌంట్ ఉంటుంది. అదే మొబిక్విక్‌తో కొనుగోలు చేస్తే 1000 రూపాయలు క్యాష్‌బ్యాక్ పొందవచ్చు. దీంతోపాటు 999 రూపాయల విలువైన బడ్స్ కూడా ఉచితంగా పొందవచ్చు. 

Also read: Honda Freed 7 Seater: 25 కిలోమీటర్ల మైలేజ్‌తో హోండా నుంచి కొత్త 7 సీటర్, ఫీచర్లు ధర ఇలా

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News