Realme Smartphone: రియల్‌మి నుంచి కొత్త స్మార్ట్‌ఫోన్, ధర, ఫీచర్లు తెలిస్తే ఇక వదిలిపెట్టరు

Realme Smartphone: ప్రముఖ స్మార్ట్‌ఫోన్ దిగ్గజం రియల్‌మి సూపర్ స్మార్ట్‌ఫోన్ లాంచ్ చేసింది. తక్కువ ధరకే లాంచ్ అయిన ఈ ఫోన్ ఫీచర్లు అద్భుతం. ఆ వివరాలు మీ కోసం..

Written by - Md. Abdul Rehaman | Last Updated : Nov 9, 2022, 11:36 PM IST
Realme Smartphone: రియల్‌మి నుంచి కొత్త స్మార్ట్‌ఫోన్, ధర, ఫీచర్లు తెలిస్తే ఇక వదిలిపెట్టరు

రియల్‌మి ఇప్పుడు మరో కొత్త వెర్షన్ లాంచ్ చేసింది. చర్చల్లో ఉన్న రియల్‌మి 10 సిరీస్ అద్భుత ఫీచర్లతో ఎంట్రీ ఇచ్చింది. అటు ధర కూడా తక్కువ కావడంతో ఆదరణ పెరుగుతోంది. 

రియల్‌మి ఇవాళ లాంచ్ చేసిన స్మార్ట్‌ఫోన్ Realme 10 4G.బడ్జెట్ ధరకు అద్బుత ఫీచర్లతో లాంచ్ అయింది. ఇందులో 6.4 ఇంచెస్ ఎమోల్డ్ ప్యానెల్, ఆధునిక హెలియో జి సిరీస్ చిప్, 50 మెగాపిక్సెల్ డ్యూయల్ కెమేరా, ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్, బ్యాటరీ సామర్ధ్యం ప్రత్యేకతలు. 

Realme 10 4G ధర

Realme 10 4G ఇండోనేషియలో రెండు వేరియంట్లలో లాంచ్ అయింది. 4 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్‌తో ఒకటి, 8 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్‌తో మరొకటి అందుబాటులో ఉన్నాయి. ఈ రెండు వేరియంట్ల ధర 14,563 రూపాయలు, 16,597 రూపాయలుంది. క్లాష్ వైట్ రష్ బ్లాక్ రంగుల్లో లభ్యమౌతోంది.

Realme 10 4G ఫీచర్లు

రియల్‌మి 10 లో 6.4 ఇంచెస్ ఎమోల్డ్ స్క్రీన్ ఉంది. ఇందులో పుల్ హెచ్‌డి రిజల్యూషన్, 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 360 హెర్ట్జ్ టచ్ శాంప్లింగ్ రేట్ ఉన్నాయి. ఈ స్మార్ట్‌ఫోన్ ఆండ్రాయిడ్ 12 ఆధారంగా నడుస్తుంది. 

Realme 10 4G బ్యాటరీ

ఈ స్మార్ట్‌ఫోన్ మీడియా టెక్ హెలియో జి99 తో పనిచేస్తుంది. ఈ ఫోన్ బ్యాటరీ 5000 ఎంఏహెచ్ ఉంది. 33 వాట్స్ ఛార్జర్ సపోర్ట్ చేస్తుంది. ఇందులో ఫింగర్ ప్రింట్ టెక్నాలజీ ఉంది.

Realme 10 4G కెమేరా

రియల్ మి 10..4జి స్మార్ట్‌ఫోన్‌లో 50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమేరా, 2 మెగాపిక్సెల్ మైక్రో కెమేరా, ఎల్ఈడీ ఫ్లాష్ ఉన్నాయి. ఇందులో 16 మెగాపిక్సెల్ కెమేరా కూడా ఉంది. ఇందులో 3.5 ఎమ్ఎమ్ హెడ్ ఫోన్ జాక్, యూఎస్‌బి టైప్ సీ పోర్ట్ మైక్రో ఎస్డీ కార్డ్‌స్లాట్ డ్యూయల్ 4జి వీవోఎల్టీఈ, ఉన్నాయి.

Also read: Samsung New Model: శాంసంగ్ నుంచి త్వరలో కళ్లు తిరిగే స్మార్ట్‌ఫోన్, ఫీచర్లు, ధర వివరాలు ఇలా

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu      

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News