Top 5 5g Phones Under 30000: 5జీ సాంకేతిక పెరగడం కారణంగా వినియోగదారులు ఎక్కువగా ఈ స్మార్ట్ ఫోన్‌లను కొనుగోలు చేసేందుకే ఇష్టపడుతున్నారు. అంతేకాకుండా ప్రస్తుతం చాలా మంది రూ. 30వేల లోపు ఉన్న ఫోన్‌లను ఎక్కువగా కొనుగోలు చేసేందుకు మొగ్గు చూపుతున్నారు. మార్కెట్‌లో బడ్జెట్ ధరల్లో చాలా స్మార్ట్ ఫోన్లు అందుబాటులో ఉన్నాయి. ఏయే కంపెనీలకు చెందిన 5జీ స్మార్ట్ ఫోన్‌లను వినియోగదారులు ఎక్కువగా కొనుగోలు చేస్తున్నారో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
రియల్ మీ 9 ప్రో ప్లాస్ (Realme 9 Pro+ 5G):
రూ. 30 వేల కంటే తక్కువ ధరలో మార్కెట్‌లో చాలా రకాల కంపెనీలకు చెందిన స్మార్ట్ ఫోన్స్ అందుబాటులో ఉన్నాయి. అందులో రియల్ మీ 9 ప్రో ప్లాస్ (Realme 9 Pro+ 5G) ఒకటి. ఇది మార్కెట్‌లో కెమెరాలో ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (OIS) వంటి కొత్త ఫీచర్‌తో అందుబాటులో ఉంది. ఈ స్మార్ట్ ఫోన్ MediaTek డైమెన్సిటీ 920 SoC ప్రోసెసర్‌తో 60W ఛార్జర్ సఫోర్ట్‌తో మార్కెట్‌లో అందుబాటులో ఉంది. అయితే మిడ్ రేంజ్‌లో మంచి స్మార్ట్ ఫోన్‌ను కొనుగోలు చేయాలనుకుంటే ఈ మొబైల్‌ను కొనొచ్చు.
Xiaomi 11T ప్రో:
ప్రస్తుతం మిడ్ రేంజ్ 5జీ స్మార్ట్ ఫోన్లలో Xiaomi 11T ప్రో కూడా ఒకటి. ఇది ప్రీమియం స్మార్ట్‌ఫోన్ సెగ్మెంట్‌లోని మొదటి స్మార్ట్ ఫోన్‌గా భావించవచ్చు. ఈ స్మార్ట్‌ఫోన్ పాలికార్బోనేట్ మిడ్-ఫ్రేమ్‌తో అందుబాటులో ఉంది. అన్ని 5జీ స్మార్ట్ ఫోన్‌లతో పోలిస్తే డెడ్ ఛీప్‌గా లభిస్తుంది. ఇందులో AMOLED డిస్‌ప్లేతో పాటు డాల్బీ అట్మాస్ సపోర్ట్ ఫీచర్ కూడా అందుబాటులో ఉన్నాయి. ఇది 888 SoC క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్‌పై పని చేయనుంది. అంతేకాకుండా ఈ మొబైల్ కొనుగోలు చేస్తే 120W ఫాస్ట్ ఛార్జర్ కూడా పొందొచ్చు.
Also Read: Virupaksha Collections : బ్రేక్ ఈవెన్‌కు దగ్గర్లో విరూపాక్ష.. దుమ్ములేపేస్తోన్న మెగా హీరో
నథింగ్ ఫోన్ 1:
నథింగ్ ఫోన్ 1 కూడా 5జీ సాంకేతికతో మార్కెట్‌లో డెడ్ ఛీప్‌గా అందుబాటులో ఉంది. ప్రీమియం బిల్డ్ క్వాలిటీ, వైబ్రెంట్ డిస్‌ప్లేతో మార్కెట్‌లో లభిస్తోంది. అంతేకాకుండా ఇందులో గ్లిఫ్ లైట్లు అనే కొత్త ఫీచర్ కూడా అందుబాటులో ఉంది. దీంతో మీరు నోటిఫికేషన్ వచ్చినప్పుడు మొబైల్ చుట్టూ లైట్లను పొందొచ్చు. ఇది మీకు ఆకర్షనీయంగా ఉంటుంది. ఇందులో చాలా రకాల కొత్త ఫీచర్లు అందుబాటులో ఉన్నాయి. ఇందులో మీరు Xiaomi 11T ప్రో, iQoo 9 SE స్మార్ట్ ఫోన్‌ల ఫీచర్ల కంటే మంచి ఫీచర్లు పొందొచ్చు.
వన్ ప్లాస్ నార్డ్ 2టీ 5జీ (OnePlus Nord 2T 5G):
వన్ ప్లాస్ నార్డ్ 2టీ 5జీ ప్రస్తుతం మార్కెట్‌లో అప్‌గ్రేడ్ మోడల్‌లో లభిస్తోంది. దీని డిజైన్ మొదటి మోడల్ కంటే ఇప్పుడు ఆకర్షనీయంగా కనిపిస్తోంది. ఈ మొబైల్‌లో డిజైన్ పరంగా వెనుక, ముందు భాగాల్లో మార్పులు చేర్పులు చేశారు. ఈ స్మార్ట్ ఫోన్ డైమెన్సిటీ 1300 SoC ప్రాసెసర్‌తో మార్కెట్‌లో లభిస్తోంది. ఇది 90Hz రిఫ్రెష్ రేట్ పాటు ఆండ్రాయిడ్ 12 ఫీచర్‌తో అందుబాటులో ఉంది. అంతేకాకుండా ఇందులో 80W ఛార్జింగ్ సామర్థ్యం కూడా ఉంది.
Also Read: Virupaksha Collections : బ్రేక్ ఈవెన్‌కు దగ్గర్లో విరూపాక్ష.. దుమ్ములేపేస్తోన్న మెగా హీరో
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook