Vivo X100 Ultra: 200-MP, 1TB స్టోరేజ్‌ శక్తివంతమైన Vivo X100 Ultra వచ్చేసింది.. ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌ ఇవే!

Vivo X100 Ultra Price: వీవో నుంచి శక్తివంతమైన స్మార్ట్‌ఫోన్‌ లాంచ్‌ అయ్యింది. దీనిని కంపెనీ Vivo X100 Ultra పేరుతో అందుబాటులోకి తీసుకు రాబోతోంది. అయితే ఈ మొబైల్‌కి సంబంధించిన ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌ ఇప్పుడు తెలుసుకుందాం.

Written by - Dharmaraju Dhurishetty | Last Updated : May 15, 2024, 11:36 AM IST
Vivo X100 Ultra: 200-MP, 1TB స్టోరేజ్‌ శక్తివంతమైన Vivo X100 Ultra వచ్చేసింది.. ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌ ఇవే!

 

Vivo X100 Ultra Price: ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌ కంపెనీ వీవో గుడ్‌ న్యూస్‌ తెలిపింది. అతి శక్తివంతమైన Vivo X100 Ultra స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసింది. ఇది ప్రీమియం కెమెరా సెటప్‌తో అందుబాటులోకి వచ్చింది. అలాగే ఈ స్మార్ట్‌ఫోన్‌ కెమెరా Samsung సహకారంతో అభివృద్ధి 1/1.4-అంగుళాల ISOCELL HP9 సెన్సార్‌తో అందుబాటులోకి వచ్చింది. ఇది DSLR కెమెరా కంటే ఎక్కువ పిక్చర్‌ క్వాలిటీ, ఫీచర్స్‌తో అందుబాటులోకి వచ్చింది. అలాగే ఈ మొబైల్‌ను కంపెనీ గరిష్టంగా 16 GB LPDDR5x ర్యామ్‌ సెటప్‌తో అందుబాటులోకి తీసుకు వచ్చింది. వీవో కంపెనీ ఈ స్మార్ట్‌ఫోన్‌ మార్కెట్‌లోకి మే 28న ప్రారంభించబోతోంది. అయితే ఈ మొబైల్‌కు సంబంధించిన ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌ ఇప్పుడు తెలుసుకుందాం.

ఫీచర్లు, స్పెసిఫికేషన్‌లు:
వీవో కంపెనీ ఈ స్మార్ట్‌ఫక్షన్‌ను అద్భుతమైన ఫీచర్స్‌తో అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ మొబైల్ 6.78 అంగుళాల 2K డిస్‌ప్లేతో అందుబాటులోకి వచ్చింది. దీంతో పాటు ఈ స్క్రీన్‌ 1440x3200 పిక్సెల్ రిజల్యూషన్‌ను కలిగి ఉంటుంది. అలాగే ఈ డిస్ల్పే E7 AMOLED డిస్‌ప్లే 120Hz రిఫ్రెష్ రేట్‌తో వచ్చింది. అలాగే ఈ స్క్రీన్‌ 3000 nits గరిష్టంగా బ్రైట్‌నెస్‌ను అందిస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్‌ 1TB ఇంటర్నల్‌ స్టోరేజ్‌ ఆప్షన్‌ను కలిగి ఉంటుంది. అంతేకాకుండా ఈ ఫోన్‌ Adreno 750 GPUతో స్నాప్‌డ్రాగన్ 8 Gen 3 చిప్‌సెట్‌పై రన్‌ అవుతుంది. 

ఇక ఈ స్మార్ట్‌ఫోన్‌ కెమెరా వివరాల్లోకి వెళితే, ఇది LED ఫ్లాష్‌తో కూడిన త్రిపుల్‌ కెమెరా సెటప్‌తో వచ్చింది. ఈ కెమెరాల్లో 50-మెగాపిక్సెల్ సోనీ LYT-900 CIPA 4.5 ప్రధాన కెమెరాను కలిగి ఉంటుంది. దీంతో పాటు లెవల్ గింబల్ ఇమేజ్ స్టెబిలైజేషన్‌ ఫీచర్‌తో రాబోతోంది. అలాగే ఇందులో అదనంఆగ  50-మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్ యాంగిల్ కెమెరా కూడా ఉంటుంది. ఇక థర్డ్‌ కెమెరా విషయానికొస్తే, ఇది 200-మెగాపిక్సెల్ APO సూపర్ టెలిఫోటో లెన్స్‌తో అందుబాటులోకి వస్తోంది. ఈ మొబైల్‌ 5500mAh బ్యాటరీతో పాటు  30 వాట్ల వైర్‌లెస్ ఛార్జింగ్‌ సపోర్ట్‌తో వచ్చింది. 

Also Read 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌ ఇవే!

ఇక ఈ స్మార్ట్‌ఫోన్‌కి సంబంధించిన OS వివరాల్లోకి వెళితే, ఇది Android 14 ఆధారిత Funtouch OSతో అందుబాటులోకి రాబోతోంది. దీంతో పాటు సెక్యూరిటీ కోసం బయోమెట్రిక్‌ సెటప్‌ను కూడా అందిస్తోంది. అంతేకాకుండా 3D అల్ట్రాసోనిక్ ఇన్-డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను కూడా కలిగి ఉంటుంది. అలాగే ఇది ప్రీమియం కనెక్టివిటీను ఫీచర్స్‌ను కూడా కలిగి ఉంటుంది. ఇక ఈ స్మార్ట్‌ఫోన్‌ ధర వివరాల్లోకి వెళితే, ఈ మొబైల్‌ రూ. 74,500తో అందుబాటులోకి రాబోతోంది. 

Also Read 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌ ఇవే!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News