Xiaomi Free Offers: బ్రాండెడ్ స్మార్ట్‌ఫోన్, స్మార్ట్‌టీవీలు ఉచితంగా..షియోమీ ఫెస్టివ్ సేల్ సెప్టెంబర్ 20 నుంచే

Xiaomi Free Offers: ఫెస్టివల్ సీజన్ ప్రారంభం కానుండటంతో చాలా కంపెనీలు అద్భుతమైన ఆఫర్లు ప్రకటిస్తున్నాయి. అయితే షియోమీ మాత్రం కొత్త స్మార్ట్‌టీవీ, స్మార్ట్‌ఫోన్ కొనవద్దంటోంది. ఎందుకంటే విచిత్రమైన ఆఫర్‌తో ముందుకొస్తోంది ఆ కంపెనీ..

Written by - Md. Abdul Rehaman | Last Updated : Sep 15, 2022, 03:53 PM IST
Xiaomi Free Offers: బ్రాండెడ్ స్మార్ట్‌ఫోన్, స్మార్ట్‌టీవీలు ఉచితంగా..షియోమీ ఫెస్టివ్ సేల్ సెప్టెంబర్ 20 నుంచే

Xiaomi Free Offers: ఫెస్టివల్ సీజన్ ప్రారంభం కానుండటంతో చాలా కంపెనీలు అద్భుతమైన ఆఫర్లు ప్రకటిస్తున్నాయి. అయితే షియోమీ మాత్రం కొత్త స్మార్ట్‌టీవీ, స్మార్ట్‌ఫోన్ కొనవద్దంటోంది. ఎందుకంటే విచిత్రమైన ఆఫర్‌తో ముందుకొస్తోంది ఆ కంపెనీ..

ఇండియాలో ఫెస్టివ్ సీజన్ ప్రారంభమౌతోంది. ముందు దసరా, తరువాత దీపావళి..ఆ తరువాత క్రిస్మస్ ఇలా వరుస పండుగలున్నాయి. అందుకే ఫ్లిప్‌కార్ట్, అమెజాన్‌లు భారీ ఆఫర్లతో ఫెస్టివల్ సేల్ ప్రారంభిస్తున్నాయి. మరోవైపు షియోమీ మాత్రం దీనికి విరుద్ధంగా ప్రచారం చేస్తోంది. అప్పుడే కొత్త టీవీ లేదా కొత్త స్మార్ట్‌ఫోన్ కొనుగోలు చేయవద్దని సూచిస్తోంది. 

సెప్టెంబర్ 20 నుంచి అమ్మకాలు

షియోమీ త్వరలో ఇండియాలో తన ఉత్పత్తుల అమ్మకాల ఉత్సవం నిర్వహించనుంది. డోన్ట్ బై టెక్ ఎట్ అంటూ ప్రచారం చేస్తూ ఆకర్షిస్తోంది. షియోమీ త్వరలో ప్రారంభించబోయే ఫెస్టివల్ సేల్ వైపుకు ఆకర్షించే ప్రయత్నం చేస్తోంది. కంపెనీ దీపావళి కంటే ముందు భారీగా సేల్స్ చేసే అవకాశాలున్నాయి. ఇండియాలో సెప్టెంబర్ 20 నుంచి సేల్స్ ప్రారంభించనుంది. 

షియోమీ అన్ని రకాల ఎలక్ట్రానిక్ ఉత్పత్తులపై భారీ ఆఫర్ ప్రకటించనుంది. కంపెనీ వెబ్‌సైట్ ప్రకారం స్మార్ట్‌ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు, టీవీలు ఉంటాయి.

స్మార్ట్‌టీవీ, స్మార్ట్‌ఫోన్ ఉచితంగా లభించే అవకాశం

సెప్టెంబర్ 15వ తేదీ అంటే ఇవాళ్టి నుంచి కంపెనీ అధికారిక వెబ్‌సైట్‌పై స్పష్టత ఇవ్వనుంది. స్పిన్ ది వీల్, సూపర్ స్లాట్ మెషీన్, పటాఖా రన్ కాంటెక్స్ట్ కూడా ఉంటాయి. ఇందులో ఉచితంగా షియోమీ స్మార్ట్‌టీవీ, రెడ్‌మి నోట్ 11ఎస్ఈ, ఇంకా ఇతర ఖరీదైన వస్తువులున్నాయి.

Also read: SIP Equity: ఎస్ఐపీ ఈక్విటీలో భారీ లాభాలు, పదివేల పెట్టుబడితో 12 లక్షల రిటర్న్స్, ఎలాగంటే

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News