RRR Pre Release Event: ముంబయి వేదికగా ఆర్ఆర్ఆర్ ప్రీ-రిలీజ్ ఈవెంట్ డేట్ ఫిక్స్

RRR Pre Release Event Mumbai: దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన 'ఆర్ఆర్ఆర్' చిత్ర ప్రీ-రిలీజ్ ఈవెంట్ (RRR Pre Release Event) డేట్ ఫిక్స్ అయ్యింది. ముంబయి వేదికగా డిసెంబరు 19న RRR గ్రాండ్ ప్రీ-రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించనున్నట్లు మేకర్స్ స్పష్టం చేశారు. ఇదే విషయాన్ని సోషల్ మీడియాలోనూ అధికారికంగా ప్రకటించారు.   

Written by - ZH Telugu Desk | Last Updated : Dec 17, 2021, 02:04 PM IST
    • RRR మూవీ ప్రీ-రిలీజ్ ఈవెంట్ డేట్ ఫిక్స్
    • ముంబయి వేదికగా డిసెంబరు 19న వేడుక
    • కార్యక్రమానికి విచ్చేయనున్న బాలీవుడ్ ప్రముఖులు!
RRR Pre Release Event: ముంబయి వేదికగా ఆర్ఆర్ఆర్ ప్రీ-రిలీజ్ ఈవెంట్ డేట్ ఫిక్స్

RRR Pre Release Event Mumbai: డైరెక్టర్ రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన భారీ బడ్జెట్ చిత్రం 'ఆర్ఆర్ఆర్' (RRR Movie Update). స్వాతంత్ర పోరాట నేపథ్య కల్పిత కథతో రూపొందిన ఈ సినిమాలో రామ్ చరణ్, ఎన్టీఆర్ ప్రధానపాత్రల్లో నటించారు. ఈ సినిమా సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది. 

ఈ సందర్భంగా చిత్ర ప్రమోషన్స్ లో చిత్రబృందం జోరు పెంచేసింది. 'ఆర్ఆర్ఆర్' చిత్ర ప్రీ-రిలీజ్ ఈవెంట్ (RRR Pre Release Event) ను గ్రాండ్ గా నిర్వహించాలని మేకర్స్ ప్లాన్ చేశారు. డిసెంబరు 19న ముంబయి వేదికగా ఈ వేడుకను నిర్వహించనున్నట్లు సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. 

అయితే ఈ ఈవెంట్ కు టాలీవుడ్ తో పాటు బాలీవుడ్ కు సంబంధించిన కొందరు ప్రముఖులు అతిథులుగా విచ్చేయనున్నారని తెలుస్తోంది. అయితే ఈ వార్తల్లో నిజమెంతో తెలియాల్సి ఉంది. 

మరోవైపు ఇటీవలే విడుదలైన RRR Trailer కు సోషల్ మీడియాలో విపరీతమైన క్రేజ ఏర్పడింది. ట్రైలర్ విడుదలైన అతి తక్కువ సమయంలోనే 100 మిలియన్ల వ్యూస్ దక్కించుకున్న తొలి ఇండియన్ సినిమాగా 'ఆర్ఆర్ఆర్' రికార్డు నెలకొల్పింది. 

రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కించిన ఈ చిత్రానికి డీవీవీ దానయ్య నిర్మించారు. ఈ సినిమాకు దాదాపుగా రూ.450 కోట్ల బడ్జెట్ (RRR Movie Budget) కేటాయించినట్లు తెలుస్తోంది. ఇందులో అల్లూరి సీతారామరాజు పాత్రలో రామ్ చరణ్, కొమురం భీమ్ పాత్రలో ఎన్టీఆర్ నటించారు. (RRR Movie Trailer Review) ఇందులో హీరోయిన్లుగా అలియా భట్, ఒలివియా మోరిస్ నటించారు. 

వీరితో పాటు అజయ్ దేవ్​గణ్, సముద్రఖని, శ్రియ తదితరులు కీలకపాత్రలు పోషించారు. కీరవాణి సంగీతమందించారు. సంక్రాంతి కానుకగా (RRR Pre Release Event Mumbai) జనవరి 7న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా (RRR Movie Release Date) రిలీజ్ కానుంది.  

ALso Read: Manasa Varanasi Corona: 'మిస్ ఇండియా'కు కరోనా పాజిటివ్- మిస్ వరల్డ్ పోటీలు వాయిదా

ALso Read: Guess Who is She: ముద్దులొలికే ఈ చిన్నారి.. మలయాళంలో టాప్ హీరోయిన్ తెలుసా?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News