Tragedy: హైదరాబాద్ లో విషాదం...చీరకు నిప్పంటుకొని గర్భిణి మృతి..

Crime news: గ్యాస్ స్టవ్ నుంచి మంటలు లీకై..ఓ గర్భిణి మృతి చెందిన ఘటన హైదరాబాద్ లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే...  

Edited by - ZH Telugu Desk | Last Updated : Nov 24, 2021, 12:05 PM IST
Tragedy: హైదరాబాద్ లో విషాదం...చీరకు నిప్పంటుకొని గర్భిణి మృతి..

Hyderabad: హైదరాబాద్ లోని ఓ ఇంట్లో విషాదం చోటుచేసుకుంది. ప్రమాదవశాత్తు చీరకు నిప్పంటుకొని ఓ గృహిణి మృతి చెందిన సంఘటన బాలానగర్‌ పోలీస్‌స్టేసన్‌(Balanagar Police Station) పరిధిలో మంగళవారం జరిగింది. ఇన్‌స్పెక్టర్‌ వాహిదుద్దీన్‌ తెలిపిన వివరాల ప్రకారం, బాలానగర్‌లోని దాసరి బస్తీకి చెందిన శివరాణి, భర్త పిల్లలతో కలిసి నివాసముంటోంది. ఈ నెల 7వ తేదీన భర్త ఊరికి వెళ్లగా... 9 నెలల గర్భవతి(Pregnant) అయిన శివరాణి తల్లిదండ్రులతో కలిసి ఉంది.

Also Read: Hyderabad: జూ పార్కులో యువకుడి హల్ చల్.. సింహం ఎన్‌క్లోజర్ లోకి దూకేందుకు యత్నం..

అదే రోజు ఉదయం ఇంట్లో వంట చేస్తుండగా గ్యాస్‌ స్టవ్‌ నుంచి మంటలు(fire) చెలరేగి శివరాణి (23) కడుపు, కళ్లకు గాయాలయ్యాయి. కాలిన గాయాలతో ఉన్న ఆమెను మల్లారెడ్డి ఆస్పత్రికి తరలించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం ఆర్‌ఎన్‌సీ ఆస్పత్రికి తీసుకెళ్లారు. గర్భంలో ఉన్న శిశువు మృతి చెందారు. శివరాణికి ఆపరేషన్‌ చేస్తుండగా 23వ తేదీ ఉదయం ఆమె మృతి చెందింది. పోలీసులు(Police) కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

 

Trending News