Car Accident: ప్రముఖ సినీ నటుడి కారు బీభత్సం.. బీఆర్‌ఎస్‌ పార్టీ నాయకుడు మృతి

Actor Raghu Babu Car Hits Bike Man Died In Nalgonda: ప్రముఖ సినీ నటుడి కారు ఢీకొని బీఆర్‌ఎస్‌ పార్టీ నాయకుడు మృతి చెందాడు. ఈ సంఘటన తెలంగాణలోని నల్లగొండ జిల్లాలో చోటుచేసుకుంది.

Written by - Ravi Kumar Sargam | Last Updated : Apr 17, 2024, 09:52 PM IST
Car Accident: ప్రముఖ సినీ నటుడి కారు బీభత్సం.. బీఆర్‌ఎస్‌ పార్టీ నాయకుడు మృతి

Car Accident: రాంగ్‌ రూట్‌లో వస్తూ కారును ఢీకొని ఓ వ్యక్తి మృతి చెందాడు. అయితే అతడిని ఢీకొన్న కారు ఓ ప్రముఖ సినీ నటుడి కారు అని తేలింది. ప్రమాదం అనంతరం నటుడి కారును స్థానికులు చుట్టుముట్టారు. అయితే నటుడి కారు తప్పేమీ లేదని తేలింది. ఈ సంఘటన తెలంగాణలోని నల్లగొండ జిల్లాలో చోటుచేసుకుంది.

Also Read: Free Fire Dispute: ఆన్‌లైన్‌ గేమ్‌లో అమ్మాయితో గొడవ.. కారు తగలబెట్టిన యువకుడు

 

నల్గొండ పట్టణ సమీపంలోని అద్దంకి- నార్కట్ పల్లి జాతీయ రహదారిపై ద్విచక్ర వాహనాన్ని కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందాడు. మృతుడు బీఆర్ఎస్ పార్టీకి చెందిన నల్లగొండ పట్టణ కార్యదర్శి సంధినేని జనార్ధన్ రావు (48)గా గుర్తించారు. అయితే ఢీకొట్టిన కారు ప్రముఖ సినీనటుడు రఘుబాబుదిగా గుర్తించారు. ప్రమాదానికి కారణంగా భావించి స్థానికులు రఘుబాబు కారును చుట్టుముట్టారు.

Also Read: Lok Sabha Elections: ప్రజలకు గుడ్‌న్యూస్‌.. 10 గ్యాస్‌ సిలిండర్లు ఫ్రీ ఫ్రీ

 

ప్రమాద తీరు చూస్తే భయానక ఉంది. కారు ఢీకొని 50 మీటర్ల దూరంలో ద్విచక్ర వాహనం ఎగిరిపడింది. తీవ్ర రక్తస్రావమై జనార్ధన్‌ రావు అక్కడికక్కడే మృతి చెందారు. అయితే ప్రమాద సమయంలో రఘుబాబు కారులోనే ఉన్నారు. ప్రమాదం అనంతరం రఘుబాబుతో వాగ్వాదానికి దిగిన స్థానికులు. ప్రమాదానికి రఘుబాబు కారు తప్పేమీ లేదని తెలుస్తోంది. జనార్ధన్‌ రావు రాంగ్‌ రూట్‌లో అకస్మాత్తుగా కారుకు ఎదురుకావడంతో ఈ ప్రమాదం సంభవించిందని తెలుస్తోంది. ఈ ఘటనపై ఇంకా పోలీసులు కేసు నమోదు చేయలేదు. ఈ ఘటనకు సంబంధించి ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News

By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.

x